Garividi Lakshmi
ఎంటర్‌టైన్మెంట్

Garividi Lakshmi: ఫోక్ ఐకాన్ ‘గరివిడి లక్ష్మి’ గ్లింప్స్ చూశారా..!

Garividi Lakshmi: టాలీవుడ్‌లో భారీ స్థాయి సినిమాలతో టాప్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని ‘గరివిడి లక్ష్మి’ (The Legendary Folk Singer Garividi Lakshmi) కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో ఆనంది (Anandhi) నటిస్తున్న ఈ చిత్రానికి గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, వాటిని ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా చూపించబోతోందని మేకర్స్ చెబుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోందని టీమ్ తెలుపుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Samantha: వెన్నెల కిషోర్‌ ఏంటి తేడాగా చేస్తున్నాడు.. పక్కన సమంత నవ్వు ఆపుకోలేకపోతుంది!

ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. వింటేజ్ వైబ్‌తో వావ్ అనేలా అదిరిపోయింది. ఊరి స్టేజీలు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్‌గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లింప్స్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళిందని చెప్పవచ్చు. లక్ష్మిగా ఆనంది పెర్ఫార్మెన్స్‌ను క్లాప్స్ పడుతున్నాయి. 15 ఏళ్లలో 10,000 స్టేజీలను తాకిన గాయనీ జీవితాన్ని రిక్రియేట్ చేస్తున్న చిత్రమిది. ఆమె పాటలు వింటూ ఎదిగిన 90స్ తరం మళ్లీ అలానే ఫీల్ అవుతుందని, ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన రోజులను గుర్తు చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. చరణ్ అర్జున్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌లోని విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేస్తోంది. పాటలు, సంగీతం, ఆర్ట్– ఇవన్నీ కలిసి ఈ గ్లింప్స్‌ని చూడగానే నచ్చేసేలా చేశాయి. ఈ గ్లింప్స్‌తో సినిమాపై కూడా అంచనాలు మొదలయ్యాయి అంటే అతిశయోక్తి కానే కాదు. అంత అద్భుతంగా గ్లింప్స్‌ని కట్ చేశారు.

Also Read- Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా

‘గరివిడి లక్ష్మి’ మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి జె. ఆదిత్య సినిమాటోగ్రపీని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా ఉంటాయని టీమ్ చెబుతోంది. నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని వంటి వారు ఈ సినిమాలో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?