Fauzi Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్ రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీతో నిరాశపరిచిన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ఫ్యాన్స్‌కు వెంటనే సక్సెస్ ట్రీట్ ఇచ్చేందుకు ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీతో రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన అప్‌డేట్స్ ప్రభాస్ అభిమానులకి మాత్రమే కాదు, సగటు సినిమా ప్రేక్షకులకి కూడా భారీ అంచనాలను కలిగిస్తున్నాయి. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, దసరా పండుగను టార్గెట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో ‘ఫౌజీ’ మూవీ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read – Chiranjeevi: రీ ఎంట్రీలో కాజల్, తమన్నా అంటే ఎవరని అడిగా..!
దసరా సెలవులే టార్గెట్‌గా..
‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్‌తో ఎమోషన్స్‌ను పండించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు హను రాఘవపూడి.. ఇప్పుడు ప్రభాస్‌తో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ సోల్జర్ అవతార్‌లో కనిపించబోతున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ఎమోషనల్ జర్నీగా ‘ఫౌజీ’ ఉండబోతోందని, విజువల్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ.. మొత్తంగా ఆరు భాషల్లో ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దసరా సెలవులను క్యాష్ చేసుకునేలా సినిమా రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ క్రేజ్, హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ కలిసి.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.
Also Read – King100: ‘కింగ్100’వ చిత్రంలో టబు.. నాగార్జున ఏమన్నారంటే?
దిగ్గజాల కాంబినేషన్‌లో..
ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఇండియన్ సినీ దిగ్గజాలు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ దిగ్గజాలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండడం ఈ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింతగా పెంచేస్తోందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సక్సెస్‌ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి-సిరీస్ తరపున గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

