Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. మూవీ 17వ రోజు కూడా కోటికి పైగా షేర్ సాధించి, సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు ముందు వచ్చిన ‘భోళా శంకర్’ మూవీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత చేసిన ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ క్రమంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ విడుదలకు ముందు చాలా మంది, చాలా రకాలుగా డౌట్స్ వ్యక్తం చేశారు. ఆ డౌట్స్ అన్నింటికీ సమాధానం చెబుతూ, మెగాస్టార్ తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. ఈ సినిమాలో పెద్దగా కథ కూడా ఏం లేదు. అంతా వింటేజ్ చిరునే అనిల్ బయటకు తీసి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఫలితంగా మరోసారి మెగాస్టార్ దెబ్బకి బాక్సాఫీస్ షేకయింది. హయ్యస్ట్ కలెక్షన్లతో రికార్డును క్రియేట్ చేసింది.
Also Read- Gunasekhar: ‘చూడాలని వుంది’లోని లవ్ సీన్‌పై గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మిస్ కాలేదు.. మరిచిపోయా!
ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఆనందంలో మంచి జోష్ మీదున్న చిరంజీవి, మీడియా వాళ్లని ప్రత్యేకంగా పిలిచి, వారితో కాసేపు టైమ్ గడిపారు. ఈ మీడియా మీట్ (Media Meet)లో ఆయన ఎన్నో విషయాలను మీడియా పర్సన్స్‌తో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన సందర్భాన్ని కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా? అని బాధపడినట్లుగా కూడా, ఆయనని మీటైన మీడియా వాళ్లు చెబుతుండటం విశేషం. రాజకీయాల గురించి చిరు చెప్పే సమయంలో ఆయనలో ఎంతో బాధ కనిపించిందని, రాజకీయాలకు తను సరిపడనని, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రమే సూటవుతాడని మరోసారి చిరు స్పష్టం చేసినట్లుగా సమాచారం. రాజకీయాల్లో ఉన్న 9 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీని మిస్ కాలేదు కానీ, ఇండస్ట్రీలోని చాలా విషయాలను మరిచిపోయానని చిరు చెప్పారట.
Also Read- Anil Ravipudi: ఎన్టీఆర్, కేటీఆర్.. విజ్ఞాన్ కాలేజ్ అనుభవాలను గుర్తు చేస్తుకున్న అనిల్ రావిపూడి!
గ్యాప్‌కు బ్రేక్
మరీ ముఖ్యంగా రాజకీయాలు వదిలేసి, ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అని చెబితే, ఆమె ఎవరు? అని ప్రశ్నించానని.. అంతగా ఇండస్ట్రీని మరిచిపోయానని చిరు అన్నారట. తర్వాత ‘మగధీర’ సినిమాలో నటించిన కాజల్ అనగానే అప్పుడు గుర్తుకు వచ్చిందని, అలా.. కాజల్, తమన్నా వంటి వారందరినీ ఆయన మరిచిపోయానని, మళ్లీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చిన కొన్నాళ్ల తర్వాత.. ఎంతగా ఇండస్ట్రీని మిస్ అయ్యింది తెలిసిందని చిరు చెప్పారట. ఈ విషయాలను చిరంజీవిని మీటైన మీడియా వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ మధ్యకాలంలో ఏర్పడుతున్న మీడియా, సెలబ్రిటీలకు మధ్య వస్తున్న గ్యాప్‌ని చిరంజీవి మళ్లీ ఇలా పూరించడాన్ని అంతా హ్యాపీగా చెప్పుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

