Gunasekhar: గుణశేఖర్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా తెరపై భారీతనం, భారీ సెట్స్ అంటే గుర్తొచ్చే పేరు గుణశేఖర్. ‘ఒక్కడు’, ‘చూడాలని వుంది’ సినిమాలతో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్, ఈ మధ్యకాలంలో చేసిన భారీ ప్రాజెక్ట్స్ అన్నీ తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో భారీతనానికి పోకుండా.. ప్రస్తుతం జనరేషన్‌ని టార్గెట్ చేస్తూ ‘యుఫోరియా’ (Euphoria) అనే మూవీని చేస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఇందులో గుణశేఖర్ (Gunasekhar) లక్కీ ఛార్మ్ భూమిక ఓ కీలక పాత్రలో నటించగా, ఇటీవల బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘దురంధర్’ చిత్రంలో నటించిన సారా అర్జున్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుగా నడిచాయి. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గుణశేఖర్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలలోని ఆసక్తికర విషయాలను చెబుతూ వస్తున్నారు.
Also Read- Anil Ravipudi: ఎన్టీఆర్, కేటీఆర్.. విజ్ఞాన్ కాలేజ్ అనుభవాలను గుర్తు చేస్తుకున్న అనిల్ రావిపూడి!
ఆ సీన్ క్రెడిట్ మొత్తం చిరంజీవికే
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో చేసిన ‘చూడాలని వుంది’ (Choodalani Vundi) మూవీలోని రైల్వేస్టేషన్‌లోని లవ్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. హీరోయిన్ అంజలా జావేరిని ఫస్ట్ టైమ్ చిరంజీవి చూసే సన్నివేశమంది. విండో సీట్ దగ్గర కూర్చున్న అంజలా జావేరిని చిరంజీవి చూసే సన్నివేశం ఆ సినిమాపై హైలెట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు హార్ట్ అని చెప్పొచ్చు. ఆ సన్నివేశం గురించి గుణశేఖర్ చెబుతూ.. ‘‘ఆ సన్నివేశాన్ని నేను ఒక నవలలా రాశాను. అప్పట్లో కూర్చుని రాస్తుంటే దాదాపు 20 పేజీల వరకు వచ్చింది. జ్యోతిచిత్రలో నా హ్యాండ్ రైటింగ్‌లో స్క్రీన్‌ప్లేను ప్రింట్ కూడా చేశారు. ఆ సీన్ క్రెడిట్ మొత్తం చిరంజీవికే ఇస్తాను. ఎందుకంటే, మొదట కథ చెప్పినప్పుడు ఈ సీన్ ఉంది. ఆయనకు నెరేట్ చేసినప్పుడు మొత్తం రెండు మూడు నిమిషాలు ఉంటుంది. ఆయన కూడా బాగుంది, చాలా కొత్తగా ఉందని అన్నారు.
Also Read- Jr NTR: ఎన్టీఆర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
నవలలా చక్కగా ఉంది
కానీ, షూటింగ్ రేపు జరగబోతుంది అనగా, రాసుకున్న 20 పేజీలను తీసుకుని వెళ్లాను. ‘ఏంటి.. పుస్తకం పట్టుకొచ్చావేంటి?’ అని అన్నారాయన. సార్, ఇది సీన్ అనగానే.. సరే చదవమని అన్నారు. నేను ఒక నవలలా దానిని చదువుతూనే ఉన్నాను. ఆయనలో ఎంత అద్భుతమైన టేస్ట్ ఉందంటే, ‘అబ్బా.. భలే ఉందయ్యా.. ఒక నవలలా చక్కగా ఉంది. ఇది ఉన్నది ఉన్నట్లుగా తీయగలిగితే నామీద చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు. మెగాస్టార్ 30 సెకన్లు డైలాగ్ లేకుండా ఉంటే, అభిమానులు అరిచేస్తారు. అలాంటి క్రేజ్ ఆయనది. ఆయన సీన్ ఉందంటే, ఆయన మాట్లాడుతూ ఉండాలి అంతే. అదే ఫ్యాన్స్ కోరుకుంటారు. వేరే వాళ్లు ఎవరైనా మాట్లాడినా వాళ్లు ఒప్పుకోరు. అలాంటి రోజుల్లో సింగిల్ డైలాగ్ లేకుండా, 10 నిమిషాల సీన్ తీశాను. ఆయన చాలా బాగుంది. చాలా బాగా వచ్చిందని అప్రిషియేట్ చేశారు’’ అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

