King100: కింగ్ నాగార్జున (King Nagarjuna) తన కెరీర్‌లో మైలురాయి చిత్రమైన 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు రా. కార్తీక్ (Ra Karthik) దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. మూవీ ప్రారంభోత్సవాన్ని కూడా సింపుల్‌గా జరిపించేసి, కామ్‌గా షూటింగ్ చేసేస్తున్నారు. ఎటువంటి చిన్న విషయం కూడా బయటకు రాకుండా, చాలా సీక్రెట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతున్నారు. ఎంత సీక్రెట్‌గా చేసినా, లీక్స్ రాకుండా ఉంటాయా? అలాంటి లీక్సే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి.. ఈ సినిమాలో టబు (Tabu) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని. టబు అనగానే అక్కినేని ఫ్యాన్స్‌లో ఒక ఆనందం, ఒక వైబ్ వంటివి వచ్చేస్తాయి. ఎందుకలా? అంటే.. అదంతే. నాగ్‌తో, ఆయన ఫ్యామిలీతో టబుకి ఉన్న బాండింగ్ అలాంటిది మరి.
Also Read- Gunasekhar: ‘చూడాలని వుంది’లోని లవ్ సీన్‌పై గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గాసిప్స్‌కు చెక్
అందుకే అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) ఫంక్షన్స్‌లో టబు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాలలో యాక్ట్ చేసిన టబు, అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి ఫ్రెండ్‌గా మారిపోయింది. ఆఫ్‌కోర్స్ ఈ విషయంలో ఆమెపై కొన్ని గాసిప్స్ కూడా నడిచాయనుకోండి. వాటిని పక్కన పెడితే.. నాగార్జునకు ఎంతో స్పెషల్ అయినటువంటి ‘కింగ్100’లో నాకూ ఓ పాత్ర ఇవ్వమని, స్వయంగా టబునే కాల్ చేసి అడిగారట. ఈ విషయం ఎవరు చెప్పారని అనుకుంటున్నారా? ఎవరో ఎందుకు చెబుతారు. స్వయంగా కింగ్ నాగార్జునే తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ నిజమే అనే క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ నాగ్ ఏమన్నారంటే…
Also Read- Anil Ravipudi: ఎన్టీఆర్, కేటీఆర్.. విజ్ఞాన్ కాలేజ్ అనుభవాలను గుర్తు చేస్తుకున్న అనిల్ రావిపూడి!
యాక్షన్ సన్నివేశాలన్నీ రియల్‌గానే..
మీ 100వ సినిమాలో టబు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కదా.. నిజమేనా? అనే ప్రశ్న ఈ ఇంటర్వ్యూలో నాగ్‌కు ఎదురైంది. ఆయన నవ్వుతూ.. మేమిద్దరం ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. తన తొలి చిత్రం నుంచి నాకు ఫ్రెండ్‌గా ఉంది. నేను వందో సినిమా చేస్తున్నానని తెలిసి, అందులో తను కూడా పార్ట్ అవుతానని కోరింది. కాదనలేకపోయాను. ఇందులో ఆమెకు చాలా మంచి పాత్ర కుదిరిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇందులో యాక్షన్ సన్నివేశాలన్నీ రియల్‌గా ఉంటాయని, ఎటువంటి వీఎఫ్‌ఎక్స్ వాడటం లేదని కింగ్ నాగ్ తెలిపారు. అదేమని అడిగితే, ఈ మధ్య ప్రేక్షకులు న్యాచురాలిటీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే రియల్‌గా ఉండేలా, కథకు తగినట్లుగా న్యాచురల్‌గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇప్పుడే అంత అవసరం లేదని, మంచి తేదీనే ఈ సినిమా విడుదలవుతుందని తెలిపారు. ప్రస్తుతం నాగ్ చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

