sandeep reddy vanga(image source:X)
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: ‘కింగ్డమ్’ ప్రమోషన్స్.. యాక్షన్‌లోకి సందీప్ రెడ్డి వంగా

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమా జూలై 31 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే నిర్మాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాజాగా విజయ్ దేవరకొండ నుంచి మరో ఇంటర్వ్యూ రాబోతోంది. అందులో రౌడీ బాయ్ తో పాటు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా జాయిన్ అవ్వనున్నాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీనిని చూసిన అభిమానులు ఈ సినిమాతో రికార్డులు తగలబెట్టేయడమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ పోస్టర్లో సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండలతో పాటుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఉన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూని త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు

Read also- Pawan kalians: ‘హరి హర వీరమల్లు’ సక్సెస్ మీట్.. అలా చేయడంలో తప్పులేదు

యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్డమ్’ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక నోట్ విడుదల చేసింది. సింగిల్ స్కీన్‌లకు జీఎస్టీతో సహా 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లకు 75 రూపాయల వరకూ పెంచుకోంచ్చని, ఈ పెంచిన రేట్లు సినిమా విడుదల తేదీనుంచి 10 రోజుల పాటు అమలులో ఉంటుందని అందులో పేర్కొంది. దీనిపై విజయ్ దేవరకొండ అభిమానులు తెగ సంబర పడుతున్నరు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ స్టార్ ఈ సారి హిట్ కొడతాడని అభిమానులు ఆసిస్తున్నారు. టికెట్ రేట్లు కూడా పెరగడంతో ఈ సారి మంచి కలెక్ట్‌న్స్ వస్తాయని చెబుతున్నారు.

Read also- Health: మసాలాలు ఎక్కువ తింటే అల్సర్ వస్తుందా?.. అసలు నిజాలు ఇవే

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఇక ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. జులై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ప్రచార చిత్రాలను చూస్తుంటే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. టీజర్ లో చెప్పన భారీ డైలాగులు చూస్తుంటే వజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు చూస్తుంటే చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telangana Politics: కాంగ్రెస్ స్కెచ్‌కి ఇరుక్కుపోయిన బీఆర్ఎస్.. ఎలా అంటే..?

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లకు ఈ వారంలోనే రూ.188 కోట్లు రిలీజ్!

Foreign Cars Smuggling Case: లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. తెరపైకి కేటీఆర్ పేరు.. లిస్టులో అందరూ ప్రముఖులే!

Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం