Eesha Rebba: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటి ఈషా రెబ్బ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకే పరిమితం అవుతోంది. గ్లామర్‌కి గ్లామర్, నటనకి నటన.. ఇలా అన్నీ ఉన్నా కూడా ఆమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ అయ్యే గ్లామర్, నటన తన సొంతమైనప్పటికీ, ఆమెను తెలుగు దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలా అనీ ఖాళీగా ఏం లేదు. సినిమా అవకాశాలు లేకపోయినా, వెబ్ సిరీస్‌ల రూపంలో ఆమె నటిగా బిజీగానే ఉంది. కానీ, తెలుగు ఆడియెన్స్ ఇలాంటి వాళ్లని స్టార్ హీరోయిన్లుగా చూడాలని కోరుకున్నా.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. సరే విషయంలోకి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత ఈషా రెబ్బ ఇలా పబ్లిక్‌లో కనిపించి సందడి చేసింది.
Also Read- Kamal Haasan: నేను అసూయ పడే నటుల్లో తనొకడు.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలోని షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్‌లో వింధ్య గోల్డ్ (Viindya Gold) సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్‌కు ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీతో ముగిసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ.. బంగారం లాంటి వేడుక ఇది. ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా, కలర్ ఫుల్‌గా నిర్వహించారు. ఈ తరహా వినూత్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి. వింధ్య గోల్డ్ వంటి నమ్మకమైన బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్‌కు బంగారు భరోసా లాంటిదని అన్నారు. వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులతో పాటు ఈషా రెబ్బ సందడి చేసి హాజరైన వారిని ఉత్సాహపరిచారు.
Also Read- OG Release Date: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ కూడా ఫిక్సయింది.. ఎప్పుడంటే?
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులెందరో ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలుగా నిలిచిన వారికి బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్.. ఈ కార్యక్రమంతో తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసుకుందని హాజరైన వారంతా అనుకోవడం విశేషం. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగా, కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు