Duvvada Divvela Couple: దువ్వాడ దివ్వెల జంట నెక్ట్స్ స్టెప్ ఇదేనా!
Duvvada Divvela Couple (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Duvvada Divvela Couple: దువ్వాడ దివ్వెల జంట.. పాలిటిక్స్ టు బిగ్ బాస్.. నెక్ట్స్ స్టెప్ ఇదే!

Duvvada Divvela Couple: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జంట దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి (Divvela Madhuri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ వివాదాస్పద వీడియోలు, ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే వ్యవహార శైలితో ఈ జంట అతి తక్కువ కాలంలోనే ఊహించని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు వీరి అనూహ్య ప్రయాణం కొత్త మలుపులు తిరుగుతోంది. తొలుత రాజకీయాలు, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలతో చర్చలోకి వచ్చిన ఈ జంట, ఆ తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి చెందిన వీడియోలు, రీల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ ట్రెండింగ్ స్టేటస్‌నే ఉపయోగించుకుని దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9)లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ పట్టేయడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు రాజకీయ వేదికలపై కనిపించిన ఈమె, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం ఆమె ప్రయాణంలో అతి పెద్ద మైలురాయిగా మారింది.

Also Read- Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?

నెక్స్ట్ స్టెప్ ఇదేనా?

బిగ్ బాస్ ఛాన్స్ దక్కించుకుని ఇటీవలే ఎలిమినేట్ అయిన దివ్వెల మాధురి, ఇప్పుడు తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి వెండితెరపై (Duvvada Divvela Film Debut) కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ జంట కలిసి చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ వైరల్ అయిన నేపథ్యంలో, ఇప్పుడు అదే అనుభవంతో వారు ‘ప్రేమంటే’ (Premante) అనే సినిమాలో స్పెషల్ రోల్‌లో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ జంట ప్రయాణాన్ని చూసిన నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘‘పాలిటిక్స్‌ నుంచి సోషల్ మీడియా, అక్కడి నుంచి బిగ్ బాస్, ఇప్పుడు వెండితెరకు… చూస్తుంటే ఈ జంట జర్నీ భలే రంజుగా ఉందిగా’’ అంటూ నెటిజన్లు పెడుతున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Also Read- Chiranjeevi: ‘కొదమసింహం’ రీ రిలీజ్.. రామ్ చరణ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మెగాస్టార్!

దువ్వాడ దివ్వెల జంట సక్సెస్ అయినట్టే..

ఒక కాంట్రవర్సీ కపుల్ తమ ఇమేజ్‌ను ఉపయోగించుకుని అతి తక్కువ కాలంలోనే రాజకీయాలు, సోషల్ మీడియా, రియాలిటీ షో (బిగ్ బాస్), సినిమా రంగాల్లోకి అడుగుపెట్టడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తమపై వచ్చే ట్రోల్స్, విమర్శలను కూడా పబ్లిసిటీగా మార్చుకుని కెరీర్‌ను నిర్మించుకోవడంలో దువ్వాడ దివ్వెల జంట సక్సెస్ అవుతోందని చెప్పవచ్చు. అలాగే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులను వారు మంచి కార్యక్రమాలను వాడటం కూడా ఈ జంట గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి మ్యాగ్జిమమ్ ఈ జంట.. ప్రజలకు చేరువ కావాలని చేస్తున్న ప్రయత్నమిదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్నో అవమానాలను జయించి, ధైర్యంగా ఈ జంట ముందుకు వెళుతుండటం మాత్రం గొప్ప విషయమనే భావించాలి. నవంబర్ 21న ‘ప్రేమంటే’ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇందులో ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించగా, సుమ కనకాల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!