Vimal Krishna Movie Opening
ఎంటర్‌టైన్మెంట్

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Vimal Krishna: ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన రచయిత – దర్శకుడు విమల్ కృష్ణ (Vimal Krishna) చేయబోతున్న తదుపరి చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 2022 వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమాతో విజయవంతంగా అరంగేట్రం చేసిన విమల్ కృష్ణ.. ఆ సినిమా సక్సెస్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపును పొందారు. ఈ దర్శకుడు చిన్న విరామం తర్వాత తన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈసారి మరో వింత పాత్రను క్రేజీగా చెప్పడానికి ఆయన ఎంచుకున్న హీరో ఎవరంటే రాగ్ మయూర్ (Rag Mayur). ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తన రేంజ్‌ని రోజురోజుకూ పెంచుకుంటూ వెళుతున్న రాగ్ మయూర్‌తో విమల్ కృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అంతేకాదు, ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- CM Revanth Reddy: 100రోజుల్లో మేడారం అభివృ‌ద్ధి పనులు పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సరదా వీడియోతో ప్రకటన

చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్నయ, చరిత్ర్ ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకుంటున్న చిత్ర పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా జరిపారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల నటించిన సరదా వీడియోతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల సంగీతం, జె.కె. మూర్తి ఆర్ట్, అభినవ్ కూనపరెడ్డి ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహించనున్నట్లుగా ప్రారంభోత్సవం రోజే మేకర్స్ అందరి పేర్లు ప్రకటించారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవ విశేషాలకు వస్తే..

Also Read- Viral Video: 52 ఏళ్లకు తండ్రి ఎంబీఏ పూర్తి.. కొడుకు ఇచ్చిన సర్ ప్రైజ్ పార్టీకి.. సోషల్ మీడియా షేక్!

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌లో..

చిత్ర పూజా కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరైంది. ఫస్ట్ షాట్‌కు మేఘ చిలక, స్నేహ జగ్తియాని క్లాప్ కొట్టారు. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి గ్రాండ్‌గా ప్రారంభించారు. ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా మార్చే ఒక వింత పాత్ర, ఆ పాత్ర స్వభావాన్ని వివరించడానికి విమల్ కృష్ణ సిద్ధమవుతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ చిలక ప్రొడక్షన్స్ (Chilaka Productions) బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 4‌గా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ బ్యానర్ గతంలో అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాతలు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్, నవీన్ చంద్ర ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌తో పాటు మరిన్ని విశేషాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!