Sekhar Kammula: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని ఉద్దేశిస్తూ.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ ఎమోషనల్ మెసేజ్‌ని ఫేస్ బుక్ వేదికగా షేర్ చేశారు. 2000వ సంవత్సరంలో ‘డాలర్ డ్రీమ్స్’ అనే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చేసిన సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శేఖర్ కమ్ముల.. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’ వంటి చిత్రాలతో వరుస సక్సెస్‌లను అందుకుంటూ సెన్సిబుల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఆయన నుంచి సినిమా వస్తుందీ అంటే, సినిమా కొలమానానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ సినిమాకు ఉంటాయని, ఆ సినిమాలు రాబోయే దర్శకులకు పాఠాలు అనేలా పేరును పొందారు. ఆయన జర్నీ మొదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తను ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి కారణమైన, తనకు అడుగడుగునా స్ఫూర్తి నింపిన వ్యక్తి దగ్గరే.. ఈ జర్నీకి సంబంధించిన సెలబ్రేషన్‌ని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతే వెంటనే ఆ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.
Also Read- Sri Sri Sri Rajavaru: ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా విడుదలవుతోంది
ఇంతకీ ఆ వ్యక్తి, శేఖర కమ్ముల దృష్టిలో ఉన్న శక్తి ఎవరని అనుకుంటున్నారా? మెగాస్టార్ చిరంజీవి. అవును, శేఖర్ కమ్ముల ఈ జర్నీకి కారణం మెగాస్టార్ చిరంజీవే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కథ, కథనానికి ఆత్మ వంటి శేఖర్ కమ్ముల 25 సంవత్సరాల సెలబ్రేషన్ అంటూ ఓ పోస్టర్‌ని డిజైన్ చేయించి, దానిపై మెగాస్టార్ సంతకం తీసుకున్నారు శేఖర్ కమ్ముల. ఈ ఫొటోలను, మెగాస్టార్‌తో కలిసి గడిపిన క్షణాలను తన సోషల్ మీడియా వేదిక ద్వారా శేఖర్ కమ్ముల పంచుకున్నారు.
‘‘టీనేజ్‌లో ఒక్కసారి చూశాను చిరంజీవిగారిని. దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్.. అంతే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు. ‘లెట్స్ సెలబ్రేట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది మెగాస్టార్ చిరంజీవే. కొన్ని జనరేషన్స్‌ని ఇన్‌స్ఫైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. కలల్ని సాకారం చేసుకునే క్రమంలో సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుందనే నమ్మకం ఇచ్చింది చిరంజీవిగారే. సో.. నా 25 సంవత్సరాల జర్నీ సెలబ్రేషన్ అంటే ఆయన సమక్షంలోనే చేసుకోవాలని అనిపించింది. థ్యాంక్యూ సార్. ఈ మూమెంట్స్‌లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’’ అని శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ అకౌంట్ వేదికగా ఓ ఎమోషనల్ మెసేజ్‌ని షేర్ చేశారు. దీనికి నెటిజన్లు కూడా అంతే ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. మా మనసుల్లో ఉన్న మాటనే మీరు ఇలా చెప్పారు సార్. చిరంజీవి అంటే నటుడు కాదు.. ఆయనొక ఎమోషన్ మాకు అంటూ రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల పోస్ట్ సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవుతోంది.
Also Read- R Narayana Murthy: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ.. పీపుల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో ‘కుబేర’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషలలో త్వరలోనే గ్రాండ్‌గా విడుదల కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు