Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా చేస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రంతో డైరెక్టర్ మారుతి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే దర్శకుల లిస్ట్‌లోకి చేరుతున్నారు. మారుతి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ హిలేరియస్ ఎంటర్‌టైనర్లుగా నిలిచి, ప్రేక్షకులను మెప్పించాయి. ఫస్ట్ టైమ్.. పాన్ ఇండియా స్టార్‌తో ఆయన సినిమా చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రాక ముందు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. మారుతితో ప్రభాస్ చేయడం ఏంటి? అని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. అందుకే చాలా రోజుల వరకు ఈ సినిమా ఒకటి ఉందని ఎవరికీ తెలియనీయలేదు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేస్తూ వచ్చారు. అలా కొన్ని రోజుల షూటింగ్ అనంతరం.. సెట్ నుంచి ఓ పిక్ లీకయింది. అప్పటి నుంచి ఈ సినిమా వార్తలలో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసి.. మారుతి తన మార్క్‌ని మరోసారి ప్రదర్శించారు. స్టార్ హీరోలను డీల్ చేయగల సత్తా తనకు ఉందని జస్ట్ టీజర్‌తోనే నిరూపించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా పెద్దగా మాట్లాడని మారుతి.. ఫస్ట్ టైమ్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
Also Read- MissTerious: నాగభూషణం మనవడు హీరోగా చేస్తున్న చిత్రానికి మంత్రి సపోర్ట్
‘‘ప్రభాస్ వంటి స్టార్‌తో ఇలాంటి సినిమా చేయడానికి కారణం.. ఇంతకు ముందు ఆయన కొన్ని కామెడీ తరహా చిత్రాలు చేశారు. యాక్షన్ హీరోలా కనిపించినా, కామెడీలో ప్రభాస్‌కు ఓ మార్క్, ఓ టైమింగ్ ఉంటుంది. దానినే పాన్ ఇండియాకు చూపించాలని.. ‘ది రాజా సాబ్’ సినిమా చేశా. ఈ కథకు అనుగుణంగా బ్రహ్మాండమైన సెట్స్ నిర్మించాం. ప్రభాస్ రేంజ్‌కి ఏ విధంగా ఉండాలో అలా చేశాం. డార్లింగ్ దర్శకుల హీరో. దర్శకుడు ఏం చెబితే అది చేసే హీరో. పాత్రకి ఎలా కావాలో అలా ఒదిగిపోయే హీరో. నేను ప్రభాస్‌కి వీరాభిమానిని. ఒక అభిమాని తన హీరోని ఎలా చూడాలని అనుకుంటాడో.. అలా ఈ సినిమాలో చూపించా. ఏ రోజు కూడా ఒత్తిడికి గురి కాలేదు.
Also Read- The Raja Saab Teaser: రెబలోడి ‘ది రాజా సాబ్’ టీజర్ ఎలా ఉందంటే..
‘ది రాజా సాబ్’ రన్ టైమ్ మూడు గంటలు ఉంటుంది. ఇందులో ప్రభాస్ ఎంట్రీ సాంగ్ ముగ్గురు హీరోయిన్లతో ఉంటుంది. ఆ సాంగ్‌ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇస్తున్నారు. ‘రాజా సాబ్’కు పార్ట్ 2 ఉంటుందా? అని అంతా అడుగుతున్నారు. అది సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ఆలోచించాల్సిన విషయం. అలా అని పార్ట్ 2 కోసం, పార్ట్ 1ని అర్థాంతరంగా ముగించి కథను సాగదీస్తానని మాత్రం అనుకోవద్దు. నేనొక క్లారిటీతో ఉన్నాను. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో కష్టపడుతున్నారు. వరసగా 18 గంటలు వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవుట్‌ఫుట్ చాలా బాగా వస్తుంది. ఇంత వరకు డార్లింగ్ ఇలాంటి జానర్‌లో సినిమా చేయలేదు. ఆయనే స్వయంగా ఒకసారి హారర్ కామెడీలో ఓ కథ రెడీ చేయమని చెప్పారు. నేను చేసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత దాదాపు అదే జానర్‌లో 500కి పైగా సినిమాలొచ్చాయి. వాటన్నింటినీ మించి ఎలాంటి కథ చేయాలా? అని ఎంతగానో ఆలోచించాను. దీని కోసం చాలా టైమ్ తీసుకున్నాను. ఫైనల్‌గా నేను అనుకున్న కథ సిద్ధమైంది. డార్లింగ్‌కు కథ చెప్పగానే.. వెంటనే సెట్ మీదకి వెళ్లిపోదాం అన్నారు. కచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా ఉంటుంది’’ అని మారుతి చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు