MissTerious Title Poster Launch
ఎంటర్‌టైన్మెంట్

MissTerious: నాగభూషణం మనవడు హీరోగా చేస్తున్న చిత్రానికి మంత్రి సపోర్ట్

MissTerious: అలనాటి నటుడు నాగభూషణం ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమో కానీ, ఇప్పుడున్న ఎంతో మంది విలన్లకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి స్ఫూర్తినిచ్చిన నటుడాయన. అలాంటి నాగభూషణం ఫ్యామిలీ నుంచి ఇప్పుడొకరు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేందుకు వస్తున్నారు. నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ (Abid Bhushan) హీరోగా, రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి (Mahi Komatireddy) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా, శివాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫైనల్ మిక్సింగ్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియో విడుదల కార్యక్రమానికి గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సపోర్ట్ లభించింది.

Also Read- The Raja Saab Teaser: రెబలోడి ‘ది రాజా సాబ్’ టీజర్ ఎలా ఉందంటే..

‘మిస్టీరియస్’ టైటిల్ పోస్టర్‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సౌత్‌లో ఉన్న అన్ని భాషలలో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా టైటిల్ పోస్టర్ చాలా బాగుంది.. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా.. సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందించాము. కథ, స్ర్కీన్‌ప్లే ప్రేక్షకులకు ఉత్కంఠను రేకెత్తించేలా ఉంటుంది. ఒక్కో క్లూని రివీల్ చేస్తుంటే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా షాకింగ్ ట్విస్ట్‌లతో ఈ సినిమా రన్ అవుతుంటుంది. ముఖ్యంగా యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయి. నేను చెబుతున్నానని కాదు.. రేపు సినిమా చూసిన తర్వాత కూడా ప్రేక్షకులు ఇలాగే చెబుతున్నారు. వారికంటే ముందు ఒక ఆడియెన్‌గా నేనే చెప్పేస్తున్నాను. టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా ఈ చిత్రానికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Also Read- Dhanush: పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది.. ‘కుబేర’ వేడుకలో ధనుష్ సంచలన వ్యాఖ్యలు

నిర్మాత జయ్ వల్లందాస్ (USA) మాట్లాడుతూ.. ముందుగా పోస్టర్ లాంచ్ చేసి, సినిమా గురించి గొప్పగా మాట్లాడిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్‌కి థ్యాంక్స్. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము. ఈ సినిమాలో మూడు పాటలు ఉంటాయి. సంగీత దర్శకుడు M.L రాజా సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. త్వరలోనే ఆడియో లాంచ్ వేడుకను గ్రాండ్‌గా నిర్మించనున్నాం. ఇకపై ప్రతి వారం ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నాము. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో రానున్న ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు