Prabhas The Raja Saab
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab Teaser: రెబలోడి ‘ది రాజా సాబ్’ టీజర్ ఎలా ఉందంటే..

The Raja Saab Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్ మాంచి ఆకలి మీద ఉన్నారు. వారి ఆకలి తీర్చడానికి అర్జెంట్‌గా ఓ సినిమా థియేటర్లలో పడాలి. ఎందుకంటే, చేతి నిండా సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉంటున్నా, ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా మారుతి (Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. అదిగో, ఇదిగో అంటున్నారే కానీ.. సరైన క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్సే తిరగబడే స్థాయికి వచ్చేశారు. ఇది గమనించిన టీమ్ అలెర్టయింది. ‘ది రాజా సాబ్’కి సంబంధించి వరుస అప్డేట్స్‌తో ఇక మోత మోగించబోతుంది. అంతేకాదు, సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు.

Also Read- Dhanush: పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది.. ‘కుబేర’ వేడుకలో ధనుష్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీని డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. అలాగే చిత్ర ప్రమోషన్స్‌ని కూడా మొదలెట్టారు. అందులో భాగంగా సోమవారం ఈ చిత్ర టీజర్‌ని గ్రాండ్‌గా విడుదల చేశారు. కొన్ని సెలక్టెడ్ ఏరియాలలో థియేటర్లలో ఈ టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఒకేసారి నిర్వహించారు. ఈ టీజర్‌ విడుదలకు ముందు వదిలిన ప్రీ టీజర్, పోస్టర్.. ఒక్కసారిగా టీజర్ కోసం వెయిట్ చేసేలానే కాకుండా.. సినిమాపై కూడా భారీగా అంచనాలను పెంచేసింది. ఇప్పుడీ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అస్సలు ఊహించని విధంగా మారుతి ఈ సినిమాలో ప్రభాస్‌ని చూపించబోతున్నారనే క్లారిటీని ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ విడుదలైన క్షణాల్లోనే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Also Read- Chaitu and Samanatha: నాగ చైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారా?

టీజర్ విషయానికి వస్తే.. ఈ టీజర్‌లో డైలాగ్స్ ఇవే..

ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం.. నా తదనంతరం కూడా దీనిని నేనే అనుభవిస్తాను.
హలో హలో.. బండి కొంచెం మెల్లగా.. అసలే మన లైఫ్ అంతంత మాత్రం.
చెప్పు.. చేసిన పాపమేమి? అని హీరోయిన్ అంటే.. ‘నేరాలు, పాపాలు ఏంటండి.. డిగ్నిఫైడ్‌గా లవ్ చేత్తిని’
చచ్చే వరకు చెయ్ వదలనని.. వేయాల్సిన ముద్రలన్ని వేసేశావ్.. అంటే.. ‘మేడమ్.. ఏదో తాగిన మత్తులో కరిసేసినట్లున్నాను’
హే జగన్నాథ ప్రభూ.. క్యా హో రాయే..
అమ్మా దుర్గమ్మ తల్లి.. కాపాడమ్మా.. తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా బయట!.. వంటి డైలాగ్స్‌తో, ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఏమేం కావాలో వాటన్నింటినీ నింపేసి.. మారుతి అదిరిపోయే పండగనే ఇచ్చేశాడు. తాతగా సంజయ్ దత్‌ని చూపించిన విధానం, ప్రభాస్ క్యారక్టరైజేషన్, హీరోయిన్లు, గ్రాఫిక్స్, థమన్ సంగీతం.. ఇలా అన్నీ వేటికవే అన్నట్లుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. చితక్కొట్టేశారు అంతే. ఇక డిసెంబర్ 5న ఈ రెబలోడు ఇచ్చే ట్రీట్‌కు సిద్ధమైపోండి.

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌ ఈ సినిమా నుంచి వస్తాయని మేకర్స్ తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!