Director Maruthi: కాలర్ ఎగరేయడంపై.. సారీ చెప్పిన మారుతి!
Director Maruthi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Director Maruthi: కాలర్ ఎగరేయడం చిన్నమాట.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్.. సారీ చెప్పిన మారుతి!

Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్టర్ మారుతి (Director Maruthi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడిన మాటలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) హర్టవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మారుతి వెంటనే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ.. హర్టయిన వారందరికీ సారీ చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగిందనే చెప్పుకోవాలి. అసలు వివాదం ఏంటి? ఎందుకు మారుతి సారీ చెప్పారు? అనే విషయాల్లోకి వస్తే..

Also Read- Director Maruthi: ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకుంటే చాలు.. టాప్ డైరెక్టర్ అయిపోతారు

కాంట్రవర్సీలో మారుతి వ్యాఖ్యలు

‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ‘రెబల్ సాబ్’ (Rebel Saab) సాంగ్‌ని ఆదివారం గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. అయితే అనుకున్న టైమ్‌కి కాకుండా కాస్త ఆలస్యం అవడంతో.. అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇది గమనించిన మారుతి వారిని ఎలా గోలా మెప్పించాలని చాలానే ట్రై చేశారు. ఇక ఈ వేడుకలో అభిమానులను ఉద్దేశించి మారుతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు, ప్రభాస్ కటౌట్‌కు అది చాలా చిన్న మాట అవుతుంది’ అని అన్నారు. ఇప్పుడిదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టవడానికి కారణమైంది. వాస్తవంగా మారుతి కావాలని మాత్రం అనలేదు. సినిమా గొప్పతనాన్ని, ప్రభాస్ స్టార్‌డమ్‌ని చెప్పడానికి మాత్రమే ఆయన అలా చెప్పుకొచ్చారు. కానీ అది వేరే రకంగా ఎన్టీఆర్ అభిమానులలోకి వెళ్లిపోయింది.

Also Read-Small Budget Films: నిజంగా ఇవి చిన్న సినిమాలా? అర్థం మారిపోతుంది..

నా ఉద్దేశ్యం కానే కాదు

‘వార్ 2’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ రెండు కాలర్స్ ఎగరేసిన అంశాన్ని గుర్తు చేసుకుంటూ.. కావాలని మారుతి ఇలా అన్నాడని, ఎన్టీఆర్‌ని అవమానించాడని ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగా చర్చలు నడుస్తున్నాయి. మారుతిపై ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇది గమనించిన మారుతి.. సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. తన ఉద్దేశ్యం అది కాదని వివరణ ఇచ్చారు. ‘‘సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతున్న ఈ అంశంపై వ్యక్తిగతంగా వివరణ ఇస్తున్నా. ముందుగా ప్రతి అభిమానికి నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కానే కాదు. కొన్నిసార్లు మాటల ప్రవాహంలో, మనం నిజంగా అర్థం చేసుకున్నదానికంటే భిన్నంగా విషయాలు బయటకు వస్తాయి. అది తప్పుగా స్వీకరించబడినా లేదా పోలికగా భావించబడినా.. అందుకు నేను చింతిస్తున్నాను. ఎన్టీఆర్, ఆయన అభిమానులందరి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. సినిమా పట్ల, మీ హీరో పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను నేను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. నేను ఈ విషయాన్ని పూర్తి నిజాయితీతో నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీరు నా పరిస్థితిని, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Medaram Jatara 2026: మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఓరి నాయనా ట్రాఫిక్‌తో కల్లుచెదిరేలా నిలిచిపోయిన వాహనాలు

Crime News: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. 12 ఇళ్లలో పంజా విసిరిన దొంగల ముఠా..?

Marriage Rumours: వాలెంటైన్స్ డే రోజున ధనుష్, మృణాల్ పెళ్లి? వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

MSG Boxoffice: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేశారు..

Labour Card: లేబర్ కార్డు అంటే ఏమిటి..? ఈ కార్డుతో కలిగే లాభాలేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..?