Small Budget Films: గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పేరుకు చిన్న బడ్జెట్ సినిమాలు అయినప్పటికీ, అవి బాక్సాఫీస్ (Box Office) వద్ద సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే, అసలు చిన్న సినిమా అనే నిర్వచనమే మారిపోయిందని చెప్పక తప్పదు. ఒకప్పుడు చిన్న సినిమా అంటే, కేవలం పరిమిత ప్రేక్షకులకు, పరిమిత వసూళ్లకు మాత్రమే అన్నట్లుండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. పెద్ద స్టార్ హీరోలతో, 300 నుండి 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు కూడా కంటెంట్ లేకపోతే బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్న ఈ రోజుల్లో, కేవలం రూ. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు కూడా నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ (Court), ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts), తాజాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) వంటి చిత్రాలు దీనికి సజీవ సాక్ష్యాలు.
Also Read- The Raja Saab: ‘పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్‌లర్ నేనేలే’.. ‘రెబల్ సాబ్’ సాంగ్ ఎలా ఉందంటే?
కొత్తదనం, మంచి కథనానికే పట్టం
ఈ సినిమాలు కేవలం తక్కువ ఖర్చుతో తెరకెక్కినప్పటికీ, వాటిలో ఉన్న బలమైన కంటెంట్, కొత్త కథనం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాయి. నిజానికి, ఈ విజయాలు సినిమా నిర్మాణంలో బడ్జెట్ అనేది ఒక పరికరమే తప్ప, విజయాన్ని నిర్దేశించే కొలమానం కాదని నిరూపించాయి. ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ డమ్ కంటే, కొత్తదనం, మంచి కథనానికే పట్టం కడుతున్నారు. ఈ మార్పుకు కారణం ప్రేక్షకుల అభిరుచి మారడమే కాదు, OTT ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచ సినిమాను చూసే అవకాశం పెరగడం కూడా. దీంతో, వారు కేవలం వినోదం కోసం కాకుండా, వైవిధ్యమైన అనుభూతిని కోరుకుంటున్నారు. ముఖ్యంగా, చిన్న బడ్జెట్ చిత్రాలు కమర్షియల్ హంగుల ఒత్తిడి లేకుండా, కథకు పూర్తిగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. దర్శకులు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. లోతైన భావోద్వేగాలను పూర్తి స్వేచ్ఛతో తెరకెక్కించగలుగుతున్నారు. అందుకే, ఇవి ప్రేక్షకుడి హృదయాన్ని బలంగా తాకగలుగుతున్నాయి.
Also Read- Vijayasai Reddy: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
మంచి కంటెంట్‌పై దృష్టి పెట్టాలి
ఈ పరిణామం సినీ పరిశ్రమకు చాలా ఆరోగ్యకరం. ఇది కేవలం పెద్ద హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలకే కాకుండా, ప్రతిభావంతులైన యువ దర్శకులకు, కొత్త నటీనటులకు తమను తాము నిరూపించుకోవడానికి ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ఈ విజయాల నేపథ్యంలో, విమర్శకులు చేస్తున్న సూచన చాలా స్పష్టంగా ఉంది. నిర్మాతలు, దర్శకులు ‘చిన్న సినిమా, పెద్ద సినిమా’ అనే విభజనను, తారతమ్యాలను పక్కన పెట్టి, ఇందులో కంటెంట్ ఉందా? లేదా? అనే ఆలోచించాలి. మంచి కంటెంట్‌పై దృష్టి పెట్టాలి. బడ్జెట్ ఎంతైనా, కథనం బలంగా ఉంటే, ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. పైనల్‌గా.. చిన్న సినిమాల ఈ వరుస విజయాలు.. తెలుగు సినిమాకు ఒక కొత్త శక్తిని, ఉత్తేజాన్ని అందిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేనే లేదని చెప్పుకోవాలి. ఇకపై, బాక్సాఫీస్ లెక్కలు కంటెంట్ చుట్టూనే తిరుగుతాయని ఈ సినిమాలు గట్టిగా చాటి చెబుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
