Director Maruthi: ప్రభాస్ ఫొటో జేబులో ఉంటే చాలు.. టాప్ డైరెక్టరే!
Maruthi Director (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Director Maruthi: ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకుంటే చాలు.. టాప్ డైరెక్టర్ అయిపోతారు

Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Also Read- The Raja Saab: ‘పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్‌లర్ నేనేలే’.. ‘రెబల్ సాబ్’ సాంగ్ ఎలా ఉందంటే?

ప్రభాస్ ఫొటో జేబులో ఉంటే చాలు..

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. డార్లింగ్ ఫ్యాన్స్ మొహాల్లో నవ్వు చూడటం కోసమే ఎంతో కష్టపడుతున్నాం. మా టీమ్ అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండక్కి ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ కటౌట్‌కు అది చాలా చిన్న మాట అవుతుంది. మీ మనసుల్లోకి రెబల్ గాడ్ అని ఎలా వచ్చిందో తెలియదు కానీ, నేనిప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. నేను చిన్న కాలేజ్‌లో చదివేవాడిని, అలాంటిది.. నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ.. ఆయన తన యూనివర్సిటీలోకి అహ్వానించారు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఆయన యూనివర్సిటీలోకి వెళ్లిన తర్వాత.. ఆయనను అర్థం చేసుకుంటూ ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. ప్రభాస్ ఫొటో జేబులో ఉంటే.. ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అయిపోతాడు. అందులో నో డౌట్. కల్మషం లేని మనస్తత్వంతో ప్రేమతోనే అందరినీ దగ్గర చేసుకుంటాడు. రెండేళ్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నానంటే నేను అదృష్టవంతుడిని అనుకుంటాను. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఇలాంటి పాట చేశారంటే అది కేవలం అభిమానుల కోసమే. అభిమానులు నాపై పెట్టుకున్న హోప్స్‌కు ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తా. ఇకపై ఒక్కొక్కటిగా రాబోయే కంటెంట్‌తో ఫ్యాన్స్ అందరూ.. రిలీజ్ ముందు వరకు రెబల్ ఆరాలో ఉంటారని చెప్పుకొచ్చారు.

Also Read- Akhanda 2: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ‘అఖండ 2’ టీమ్.. ఫొటోలు వైరల్!

ప్రభాస్ ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా ఇదే..

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ కోసం మీ కంటే (అభిమానులు) ఎక్కువగా మేము వెయిట్ చేస్తున్నాం. జనవరి 9న సినిమా వస్తుందా? రాదా? అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జనవరి 9న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాం. గ్లోబల్‌గా అత్యధిక థియేటర్స్‌లో లార్జెస్ట్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం. ఫస్ట్ డే అన్ని బాక్సాఫీస్ రికార్డులను కొట్టబోతున్నాం. కాస్త ఆలస్యమైనా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే అన్ని ఎలిమెంట్స్‌తో గ్రాండ్ గా రూపొందిస్తున్నాం. ఫైట్స్, సాంగ్స్, డ్యాన్సెస్.. ఇలా అన్నీ కలిపి ఒక భారీ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దాదాపు వెయ్యిమంది గ్రూప్ డ్యాన్సర్స్‌తో రూపొందించిన ‘రెబల్ సాబ్’ సాంగ్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా మాదే కావొచ్చు. ఆయన స్వీట్ పర్సన్. ప్రభాస్‌తో ఇంత బిగ్ మూవీ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hyderabad Crime: చెంగిచెర్లలో వరుస దొంగతనాలపై క్లూ సేకరించిన పోలీసులు..?

Anaganaga Oka Raju: పండక్కి రాజు గారి హవా మామూలుగా లేదుగా.. రెండ్రోజుల గ్రాస్ ఎంతంటే?