Atlee Priya: ప్రముఖ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు తమ సోషల్ మీడియా ద్వారా ఒక అందమైన ఫోటోషూట్‌ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మా ఇల్లు మరికొంత సందడిగా మారబోతోంది. అవును, మేము మళ్ళీ గర్భవతి అయ్యాము. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి’ అంటూ వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రకటన కోసం వారు తమ కుమారుడు ‘మీర్’ తో కలిసి దిగిన ఒక క్యూట్ ఫ్యామిలీ ఫోటోను పంచుకున్నారు. ఇందులో ప్రియ బేబీ బంప్‌తో కనిపిస్తుండగా, అట్లీ, మీర్ ఆమెను ప్రేమగా చూస్తున్నట్లు ఉన్నాయి. ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. టాలీవుడ్ కోలీవుడ్ తారలు సమంత రూత్ ప్రభు, కీర్తి సురేష్ తదితరులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అట్లీ, ప్రియలకు ఇప్పటికే ‘మీర్’ అనే కుమారుడు ఉన్నాడు. 2023 జనవరిలో మీర్ జన్మించారు. ఇప్పుడు రెండో బిడ్డ రాబోతుండటంతో అట్లీ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. అట్లీ ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, తదుపరి ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్త పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Nara Rohith: వెంకటేష్ ‘ఎకే 47’లో పవర్ ఫుల్ రోల్ చేయబోతున్న నారా రోహిత్.. ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కలిసి ఒక భారీ సై-ఫై చిత్రం ‘AA22xA6’లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే అతడు ఈ సినిమాలో నాలుగు విభిన్న పాత్రలను (తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు) పోషిస్తున్నాడు. ఇలాంటి సినిమాలో అల్లు అర్జున్ చేయడం ఇదే మొదటి సారి. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ చాలా టైట్‌గా నడుస్తోంది. ఎందుకంటే ఇందులో అంతర్జాతీయ స్థాయి కళాకారులు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కాబట్టి ఏదైనా ఆలస్యం ఉత్పత్తి ఖర్చులను పెంచి, షెడ్యూల్‌ను డిస్రప్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ తన వ్యక్తిగత బాధ్యతలు సినిమా కమిట్‌మెంట్‌ను సమతుల్యం చేస్తూ కనిపించాడు. అట్లీ గతంలో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ (2023) సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాడు. ఈ సినిమా ద్వారా అతను బాలీవుడ్‌లో తన సత్తా చాటాడు. ఇప్పుడు ‘AA22xA6’తో తన దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని దర్శకత్వ శైలి, యాక్షన్, డ్రామా కలగలిపిన కథనం అభిమానులను ఆకర్షిస్తోంది.
Read also-Allu Arjun: మెగాస్టార్ సినిమా గురించి ఐకాన్ స్టార్ ఏం అన్నారంటే?.. ఇది సార్ బ్రాండ్..
Our home is about to get even cozier with the addition of our newest member!
Yes ! We are pregnant again ❤️
Need all your blessings , love and prayers 🥰
With love
Atlee , Priya , Meer , Becky , Yuki , chocki , Coffee and Goofy ❤️⭐️ pic.twitter.com/10ThlH3TK8— atlee (@Atlee_dir) January 20, 2026

