Nara Rohith: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో నారా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆయన కెరీర్‌లో ఒక అరుదైన ‘ఫుల్ సర్కిల్’ మూమెంట్ చోటుచేసుకుంది. ఒకప్పుడు ఐకానిక్ సినిమా ‘పుష్ప’లో మిస్ అయిన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రను, ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన గ్లోబల్ సెన్సేషన్ ‘పుష్ప: ద రైజ్’లో భన్వర్ సింగ్ షెకావత్ అనే నెగెటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. అయితే, ఈ పాత్ర కోసం సుకుమార్ ప్రాథమికంగా ఆలోచించిన పేర్లలో నారా రోహిత్ ఒకరు. అప్పట్లో రోహిత్ గడ్డం, మీసాలతో ఉన్న రఫ్ లుక్ చూసి సుకుమార్ ఆయన్ని సంప్రదించారు. కానీ, సినిమా పాన్-ఇండియా రేంజ్‌కు వెళ్లడం, మార్కెట్ సమీకరణాల దృష్ట్యా ఆ పాత్ర మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ చెంతకు చేరింది.
Read also-Allu Arjun: మెగాస్టార్ సినిమా గురించి ఐకాన్ స్టార్ ఏం అన్నారంటే?.. ఇది సార్ బ్రాండ్..
త్రివిక్రమ్ – వెంకీ మూవీలో ‘యాంటీ కాప్’
చాలా కాలం తర్వాత నారా రోహిత్ ఒక పవర్‌ఫుల్ ‘యాంటీ కాప్’ రోల్ చేసే అవకాశం దక్కించుకున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (AK 47). ఈ సినిమాలో రోహిత్ ఒక కీలకమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. త్రివిక్రమ్ రాసే పదునైన సంభాషణలకు, రోహిత్ బేస్ వాయిస్ తోడైతే స్క్రీన్ మీద ఆ ఇంపాక్ట్ మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా కోసం రోహిత్ తన బాడీ లాంగ్వేజ్ లుక్‌ని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోను ఢీకొట్టే పాత్రలో రోహిత్ నటించడం ఆయన కెరీర్‌కు మలుపు తిప్పే అంశం. ప్రస్తుతం నారా రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ‘సుందరకాండ’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మరోవైపు ‘భైరవం’ లాంటి యాక్షన్ మూవీస్ లో చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో ఇలాంటి చాలెంజింగ్ రోల్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాతో అయినా నారా రోహిత్ మంచి విజయం అందుకోవాలని నారా ఫ్యాన్ కోరుకుంటున్నారు. అయితే ఏం జరుగుతుందో చూడాలిమరి.
Read also-Ticket Hike: సినిమా టికెట్ల వివాదంపై మరో సారి సీరియస్ అయిన తెలంగాణ హైకోర్ట్..

