Allu Arjun: మెగాస్టార్ చిరంజీవీ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో తెలిసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. అందులో మెగాస్టార్ సినిమా గురించి పొగుడుతూ రాసుకొచ్చారు. దీనిని చూసిన మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకూ ఆయన ఏం రాసుకొచ్చారంటే..‘మెగాస్టార్ చిరంజీవి గారి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఘనవిజయం సాధించినందుకు అభినందనలు. అసలు బాస్ ను మళ్లీ ఇలా చూస్తాం అని అనుకోలేదు. ఈ సినిమాలో బాస్ ను చూస్తుంటే వింటేజ్ లో మెగాస్టార్ ను మరొక్కసారి తెరపై చూసినట్లుంది. ఆ పైరింగ్ పర్ఫామెన్స్ చూసి ఫిదా అయిపోయాను. మళ్లీ వెండి తెరపై ఆ రేంజ్ లో చూడటం చాచా సంతోషంగా ఉంది. అంటూ రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Chiranjeevi Fans: తనపై చూపిస్తున్న అభిమానుల ప్రేమకు ఫిదా అయిన మెగాస్టార్.. ఏం అన్నారంటే?
అంతే కాకుండా.. బాస్ ఈజ్ బ్యాక్! నిజంగా ఇది నిప్పులు చెరిగే పర్ఫార్మెన్స్. మన మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ వెండితెరపై ఆ రేంజ్‌లో చూడటం చాలా సంతోషంగా ఉంది. పక్కా వింటేజ్ లుక్ లో మెగాస్టార్ కనిపించారు.వెంకీ గౌడ పాత్రలో వెంకీ మామ అదరగొట్టేశారు. నయనతార తనదైన గ్రేసియస్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. క్యాథరిన్ తన హ్యూమరస్ నటనతో నవ్వులు పూయించారు. సంక్రాంతి స్టార్ బుల్లిరాజు ఎనర్జీ సూపర్. విజిల్స్ వేయించేలా ఉన్న హుక్ స్టెప్, మెగా విక్టరీ వంటి పాటలను అందించిన భీమ్స్ సిసిరోలియోకి, అలాగే మిగిలిన సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు. ఈ చిత్రాన్ని నిర్మించిన నా ప్రియమైన కజిన్ సుస్మిత కొణిదెల కి సాహు గారపాటికి స్పెషల్ కంగ్రాట్స్ అని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మెషీన్ అనిల్ రావిపూడి గారికి భారీ అభినందనలు. ‘సంక్రాంతికి వస్తారు – హిట్ కొడతారు – రిపీటు!’ అయింది. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు… ఇది అసలైన సంక్రాంతి ‘బాస్’-బస్టర్! అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Read also-Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ.. ఏం అన్నారంటే?
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L – I – T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026

