Dandora Movie: శివాజీ ప్రధాన పాత్రలో వచ్చిన దండోరా సినిమా థియేటర్లలో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసింది. తాజాగా ఈ సినిమా చూసిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ టీం ను పొగడ్తలతో ముంచెత్తారు. సినిమా చూసిన అనంతరం ఆయన రివ్యూ ఇచ్చారు. ఈ విషయం గురించి తన ట్విటర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. ‘దండోరా సినిమా చూశాను. ఇది చాలా ఆలోచింపజేసే, శక్తివంతమైన చిత్రం. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తమ అద్భుతమైన నటనతో సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నారు. సినిమా చూసినంత సేపు సమాజంలో జరిగే కులం వివక్ష కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది అందరినీ ఒక సారి ఆలోచింపజేస్తుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివక్ష కళ్లకు కట్టినట్లు చూపించారు. అంటూ దండోరా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Read also-Allari Naresh: ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?
అంతేకాకుండా.. సమాజాన్ని మెల్కొలిపే ఇంతటి బలమైన కథను రాసి, మట్టి వాసన ఉన్న కథను తెరపై అంత అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి హ్యాట్సాఫ్. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించి, వెన్నుతట్టి నిలిచిన రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఈ అద్భుతమైన సినిమాలో భాగమై, తమ వంతు సహకారాన్ని అందించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అంటూ రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా థయేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా జనవరి 14, 2026 నుండి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది.
Read also-Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక సోషల్ డ్రామా. కుల వివక్ష, సామాజిక అంతరాలు మరియు ఒక తండ్రి-కొడుకుల మధ్య ఉండే సంఘర్షణల చుట్టూ కథ తిరుగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి మరణం తర్వాత జరిగే అంత్యక్రియల విషయంలో ఎదురయ్యే కుల రాజకీయాలను ఈ సినిమాలో బలంగా చూపించారు. ఈ చిత్రం 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

