Allari Naresh: ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం..
allari-naresh(image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Allari Naresh: ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?

Allari Naresh: టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాతగారు (ఈవీవీ సత్యనారాయణ గారి తండ్రి) ఈదర వెంకట్రావు వ మరణించడం వృద్ధాప్య కారణాలతో మరణించారు. ఆయన మరణంతో అల్లరి నరేష్ కుటుంబానికి పెద్ద లోటు ఏర్పడింది. ఈదర వెంకట్రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో నివసించేవారు. ప్రస్తుతం ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. కుమారుడు ఈవీవీ సత్యనారాయణ సినిమా రంగంలో అగ్ర దర్శకుడిగా ఎదిగినా, వెంకట్రావు మాత్రం తన సొంత ఊరిలోనే ఉంటూ వ్యవసాయం పనులు చూసుకునేవారు. ఆయన భార్య వెంకటరత్నం గారు 2019లో మరణించారు. అప్పటి నుంచి ఆయన తన ఇతర కుమారులతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. ఈవీవీ సత్యనారాయణ 2011లోనే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తాత కూడా మరణించడంతో కుంటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.

Read also-Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్.. ఏం చేస్తారంటే?

ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణించడంతో, ఈ వార్త తెలిసిన వెంటనే అల్లరి నరేష్, ఆయన అన్నయ్య ఆర్యన్ రాజేష్, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుమామిడికి బయలుదేరారు. కోరుమామిడిలోని వారి స్వగృహంలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. సాయంత్రం 4 గంటలకు గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంకట్రావు మరణవార్త తెలియగానే టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు మరియు నటీనటులు అల్లరి నరేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అల్లరి నరేష్‌కు తన తాతగారితో మంచి అనుబంధం ఉండేదని, షూటింగ్స్ లేని సమయంలో అప్పుడప్పుడు వెళ్లి ఆయన్ని కలిసి వచ్చేవారని సన్నిహితులు చెబుతున్నారు.

Read also-Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

Just In

01

Bhatti Vikramarka: అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

Nitin Nabin – Modi: నేను బీజేపీ కార్యకర్తను… నాకు బాస్ నితిన్ నబీన్.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ.. ఏం అన్నారంటే?

Ramya Rao: అక్రమ దందాలపై.. బీఆర్ఎస్ మాజీ ఏంపీ జోగినపల్లి సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు.!

Viveka Murder Case: వివేకా కేసులో సంచలనం.. సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు.. దర్యాప్తు ఓ కొలిక్కిరాబోతుందా?