Chiranjeevi Fans: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీనిని చూసిన వింటేజ్ మెగాస్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పట్లో మెగాస్టార్ ఎలా ఉండేవారో గుర్తు చేసుకుని తమ అభిమానాన్ని గుర్తు చేసుకుని మరో సారి థియేటర్లలో కేరింతలు కొడుతున్నారు. ఇదంతా చూసిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని ఫిదా అయిపోయారు. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక నోట్ రాసుకొచ్చారు. అందులో అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. దీనిని సంబంధించి నోట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Read also-Renu Desai: అందుకే తరచూ కాశీకి వెళ్తుంటానంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్..
అందులో ఎం రాసుకొచ్చారంటే?.. మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, ప్రేమ చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావంతో నిండిపోయింది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే.. నా జీవితం ప్రేమాభిమానాలతో నిండిపోయింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజం అని మీరు నిరూపించారు. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Allari Naresh: ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?
From the heart,
with love & gratitude 🙏🏻 pic.twitter.com/LJ2g32x3qC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2026

