Dil Raju: డిసెంబర్ 25న విడుదలై మంచి టాక్‌తో పాటు కలెక్షన్లను రాబట్టిన చిత్రం ‘శంబాల’ (Shambhala). ఈ సినిమా ఇయర్ ఎండింగ్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి క్రిస్మస్ విన్నర్‌గా నిలిచింది. ముఖ్యంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆదికి (Aadi Saikumar) మాత్రం ‘శంబాల’ మంచి బ్రేక్ ఇచ్చింది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన ఐయ్యర్ హీరోయిన్‌గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టడంతో మేకర్స్ ‘శంబాల’ థాంక్స్ మీట్ (Shambhala Thanks Meet)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) హాజరై, యూనిట్‌ను అభినందించారు.
Also Read- First Ticket: పవన్ కళ్యాణ్, బాలయ్య రూ. 5 లక్షలు.. చిరు సినిమాకు ఇంత తక్కువా?
సాయికుమార్ ‘బొమ్మరిల్లు’ ఫాదర్
ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా దర్శకులు యుగంధర్‌కు, ఇద్దరు నిర్మాతలు రాజశేఖర్, మహిధర్ రెడ్డిలకు, ఆది సాయి కుమార్, అర్చన సహా చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. క్రిస్మస్‌కి విడుదలైన 5 సినిమాల్లో ‘శంబాల’ సక్సెస్‌గా నిలబడటం గొప్ప విషయం. లాస్ట్ మంత్ నేను విదేశాల్లో ఉన్నాను. అయినా, విడుదలైన అన్ని సినిమాలను ఫాలో అప్ చేస్తుంటే ‘శంబాల’ 100 పర్సెంట్ సక్సెస్ అని విన్నాను. ఈ సినిమాకు పబ్లిక్‌లో మంచి టాక్ రావడం, విజయవంతంగా నిలబడటం చాలా సంతోషకరమైన విషయం. ఆది 25వ సినిమా విజయవంతం కావడం రియల్లీ హ్యాపీ. ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా చేంజ్ తీసుకొచ్చింది. నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ళ నాన్న సాయి కుమార్‌లతోనే తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపనను మాటల్లో చెప్పలేం. అది సాయి కుమార్‌లో చూశాను. ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచి, విజయంలో ఆయన భాగమయ్యారు. సాయి కుమార్ ఇండస్ట్రీలోని అందరితో మంచిగా ఉంటారు. ఇది టాలీవుడ్‌లో ఆయన ఒక్కడికే చెల్లింది. ఈ సినిమా ప్రోమో చూసినప్పుడే చెప్పా ఇది సక్సెస్ అవుతుందని.. ఇప్పుడు అదే జరిగినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఈ రోజుల్లో ఒక సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయడం, సక్సెస్ కావడం మామూలు విషయం కాదు. ‘శంబాల’ మూవీ అది చేసి చూపించింది. అందరికీ మరోసారి కంగ్రాట్స్’’ అని తెలిపారు.
Also Read- Bhogi: ఎట్టకేలకు ‘భోగి’ అప్డేట్.. శర్వా, సంపత్ నంది సినిమా ఉన్నట్టే!
సంక్రాంతి సినిమాలకు ఆల్ ద బెస్ట్
ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ రోజు మా సినిమా థాంక్స్ మీట్‌కు దిల్ రాజు వంటి నిర్మాత రావడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో పోటీ నడుమ విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉండటం పట్ల పట్టలేని ఆనందంతో ఉన్నాం. ఈ సినిమాను మౌత్ టాక్‌తో ముందుకు తీసుకెళ్తున్న ఆడియన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపై కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకొని, ఏది పడితే అది చేయకుండా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తానని మాటిస్తున్నాను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, అన్నీ బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. సాయి కుమార్ మాట్లాడుతూ.. దిల్ రాజు అందరి గురించి ఆలోచిస్తారు. సపోర్ట్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి. పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆ రోజు పోలీస్ స్టోరీకి నాకు మెమెంటో రావడం ఇప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా శంబాల చిత్ర యూనిట్ అందరికీ దిల్ రాజు మెమెంటో అందిస్తున్నారు. ఆయనకు అందరి తరఫున స్పెషల్ థ్యాంక్స్. ‘శంబాల’ నాకు మంచి కిక్కిచ్చింది. అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ఈ సినిమాను టాలీవుడ్ అంతా సెలబ్రేట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లందరికీ థ్యాంక్స్. జనవరి 9న హిందీలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు, హీరోయిన్.. చిత్ర సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

