Dharmasthala Niyojakavargam: కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ చాలా వరకు న్యూ పోస్టర్స్‌ను మేకర్స్ వదిలారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam) చిత్ర బృందం నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. స్ట్రాంగ్ టైటిల్, దానికి తగ్గట్టుగానే భయానకంగా ఉన్న ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సౌండ్ వినిపించే అవకాశముందని అనుకోవచ్చు. ఈ సినిమాలోని సీనియర్ నటులు సుమన్ (Suman), సాయికుమార్ (Sai Kumar) తమదైన నటనతో మెప్పించడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh), ఆయన భార్య వితికా షేరు (Vithika Sheru) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, కాలకేయ ప్రభాకర్, పృథ్వి వంటి హేమాహేమీలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
Also Read- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ టీజర్ అదిరింది
పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ఇది కేవలం రాజకీయాల చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు, ఇందులో బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సాంకేతిక హంగుల విషయంలోనూ ఈ చిత్రం హై క్వాలిటీతో ఉంటుంది. ముఖ్యంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్, ఆయన రాసిన అద్భుతమైన పదాలకు, గాయని సునీత తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే పాటలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో! ప్రోమో అదిరింది
ఫిబ్రవరిలో రిలీజ్ సందడి..
ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసి, ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిజ జీవిత రాజకీయాలకు, వెండితెర డ్రామాకు మధ్య ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’ ఎలాంటి పోరు సాగిస్తుందో చూడాలి. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బైక్ ఎక్కించి మరి భయపెడుతున్న తీరు చూస్తుంటే, థియేటర్లలో మాస్ రచ్చ గ్యారెంటీ అని అనిపిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

