Devara 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ..
Devara-2-Update
ఎంటర్‌టైన్‌మెంట్

Devara 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. ‘దేవర 2’పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Devara 2 Update: ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపారు ప్రముఖ నిర్మా సుధాకర్ మిక్కిలినేని. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర్ పార్ట్ 1’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత దేవర్ 2 కోసం ఇప్పటి వరకూ అధికారికంగా అప్డేట్ ఏమీ రాలేదు. తాజాగా దేవర పార్ట్ 1 నిర్మాతల్లో ఇకరైన సుధాకర్ మిక్కిలినేని (Sudhakar Mikkilineni) ఓ ఈవెంట్ లో ‘దేవర పార్ట్ 2’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించి పనులు జరుగుతున్నాయని షూటింగ్ మే, 2026 నుంచి మొదలవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. ఈ సినిమా 2027 లో విడుదలై మరో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ‘దేవర పార్ 2’ పై ఆశలు వదిలేసుకున్న అభిమానులకు ఈ వార్త కొత్త ఊపిరి అందించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘దేవర పార్క్ 2’ఇక ఉండదంటూ వస్తున్న వార్తలకు ఈ వీడియోతో చెక్క్ పెట్టారు నిర్మాత. దీంతో ‘దేవర 2’ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Varun Dhawan: బాలీవుడ్ స్టార్ హీరోకు వార్నింగ్ ఇచ్చిన ముంబై మెట్రో అధికారులు.. ఎందుకంటే?

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర పార్ట్ 1’ ఎన్టీఆర్ హిట్ పరంపరను కొనసాగించింది. దేవర కూడా కమర్షియల్ గా హిట్ సాధించింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ‘దేవర 2 మొదలవుతుందని అనుకున్నారు. అదే సమయంలో బాలీవుడ్ మూవీ ‘వార్ 2 ’లో కనిపించారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘వార్ 2 సినిమా’  అనుకున్నంత ఆడకపోవడంతో ఎన్టీఆర్ ఇక దేవర పార్ట్ 2 ఇక చేయడం లేదంటూ పెద్ద ఎత్తున టాక్ వివిపించింది. అదే సందర్భంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంతో వస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిపంచినా.. దేనిమీదా క్లారిటీ అయితే రాలేదు. తాజాగా దేవర నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ లో సినిమా అయిపోయాక దేవర 2 పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Read also-Devara 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. ‘దేవర 2’పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?