Deepika Padukone: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దీపికా పదుకొనే పేరు ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే, ఈ ముద్దుగమ్మ చేసిన పనులు అలాంటివి. వరుసగా రెండు సార్లు కొత్త ప్రొజెక్ట్స్ నుంచి తప్పుకోవడంతో రక రకాల అనుమానాలు వస్తున్నాయి. ‘కల్కి 2’ నుంచి ఆమెను తప్పించారన్న అఫీషియల్ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొందరు నెటిజన్లు ఆమె పై ఘోరంగా విమర్శలు చేస్తున్నారు. ట్రోల్స్, మీమ్స్‌తో ఆమెను దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు ఆమెను ఓ వైపు సపోర్ట్ చేస్తూనే చేస్తునే, ఇంకో వైపు కొందరు “అసలు నీవు ఆడదానివేనా?” అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ దీపికా చేసిన తప్పేంటంటే ఇక్కడ తెలుసుకుందాం..
రెమ్యూనరేషన్ విషయంలో ఆమె ఏమాత్రం సర్దుబాటు చేసుకోదట. అంతేకాదు, తన టీమ్‌ను కూడా తనతో సమానంగా చూసుకోవాలని డిమాండ్ చేస్తుందట. ఈ డిమాండ్లు తట్టుకోలేక కొందరు నిర్మాతలు ఆమెను సినిమాల నుంచి తప్పించారని టాక్. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఏకంగా ఆరు సినిమాలకు దీపికా గుడ్‌బై చెప్పిందట. అవేంటంటే ‘సుల్తాన్’, ‘జై హో’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘కిక్’, ‘శుద్ధి’ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలు.
Also Read: Chamala Kiran Kumar Reddy: మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కారణం? రెమ్యూనరేషన్ విషయంలో ఆమె గట్టిగా నిలబడటమే ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు దీపికాపై మండిపడుతూ, “అసలు నీవు మనిషివేనా? డబ్బు కోసం ఏదైనా చేస్తావా?” అంటూ చాలా మంది విరుచుకుపడుతున్నారు. ఈ రెమ్యూనరేషన్ వివాదం ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.