web series: ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు వైవిధ్యమైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అదే తరహాలో రాబోతుంది ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్‌ఫుల్ సిరీస్‌లను అందించిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందిస్తోంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించారు. ఉదయ భాను ముఖ్య పాత్రను పోషించారు. ఇక ఓటీటీ రైజింగ్ స్టార్స్ అయిన వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తండ్రైన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి కనిపించటం లేదని వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషణ చేస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు.. మోసాలు.. వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణం ప్రేక్షకులను మెప్పించనుంది.
Read also-Physics Nobel: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ అవార్డ్.. 1985లో ప్రయోగం.. నేడు విప్లవాత్మక మార్పులు
ఈ సందర్భంగా.. తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ ‘‘మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని మా జీ 5 నమ్మకం. అలాంటి కథే ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. ఇది తండ్రి మనసులోని ప్రేమ, బలమైన ఇంటెన్సిటీని, మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథాంశమిది. దీన్ని సస్పెన్స్‌తో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చొని పెడుతుంది. రాజీవ్ కనకాల, ఉదయభాను వసంతిక అద్భుతమైన నటనతో మెప్పించారు. పోలూరు కృష్ణ, సౌతిండియన్ స్క్రీన్స్ ఈ సిరీస్‌ను మనసుకి హత్తుకునేలా, ప్రభావవంతంగా రూపొందించారు’’ అన్నారు.
Read also-Mass Jathara: ‘మాస్ జాతర’లో ‘ఓలే ఓలే’ సాంగ్ వివాదంపై స్పందించిన రవితేజ.. శ్రీలీల సపోర్ట్..
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’లోని ఎమోషనల్ కంటెంట్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మిస్టీరియస్, సస్పెన్స్‌ఫుల్ నెరేషన్‌తో సాగేది మాత్రమే కాదు. తండ్రీ కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రసాదరావుగా నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్‌ను ఫీలయ్యాను. యూనివర్సల్ పాయింట్‌తో నడిచే కథతో రూపొందింది.’’ అన్నారు. నటి ఉదయభాను మాట్లాడుతూ ‘ఈ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గానే కాదు.. బలమైన ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది. ఇంటెన్స్ స్టోరీ మనసులను తాకుతుంది. ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను.’ అన్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
