Mass Jathara: మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు రవితేజ మాస్ యాక్షన్ కామెడీ తో కలిపి చూపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలై ‘ఓలే ఓలే ’సాంగ్ లో బూతులు ఎక్కువగా ఉన్నాయంటూ పాటు మరో విధంగా మార్చి రాయాలంటూ పలువురి నుంచి డిమాండ్ లు వినిపించాయి. తాజాగా సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ పాట వివాదంపై రవితేజ క్లారిటీ ఇచ్చారు. ఓలే ఓలే పాట లో వచ్చిన లిరిక్స్ ఆ సందర్భానికి అవి చాలా అవసరమని.. ముందు నాలుగు మాటలు విని పాట మొత్తం గురించి మాట్లాడవద్దని పాటను విమర్శించిన వారికి హితవు పలికారు. దీనికి హీరోయిన్ శ్రీలీల కూడా సపోర్ట్ చేస్తూ అసలు ఆ పాట అలా ఉండటమే కరెక్ట్ లేకపోతే ఆ పాటకు అర్థం ఉండదు. సందర్భం బట్టి సినిమాల్లో పాటలు వస్తుంటాయి సినిమా మొత్తం చూసిన తర్వాత దీని గురించి మాట్లాడితే బాగుంటది అని రవితేజ పాటను విమర్శించే విరికి తెలిపారు. దర్శకుడు కూడా పాట లిరిక్స్ విషయంలో ప్రేక్షకులు తప్పుగా అనుకుంటున్నారన్నారు.
Read also-VC Sajjanar: కొంతమంది అలా డ్రైవింగ్ చేస్తున్నారు.. ఊరుకోబోం.. హైదరాబాదీలకు సజ్జనార్ వార్నింగ్
“మాస్ జాతర” రవితేజ 75వ సినిమా, భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ స్టైలిష్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీం సేసిరొలియో అందిస్తున్నాడు. టీజర్, ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రవితేజ స్టైల్, ఎనర్జీతో పాటు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపిన మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఎన్నో సార్లు వాయిదా తర్వాత మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రచారం ఊపందుకుంది. పలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. రవితేజ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
Read also-Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?
మొదట ఈ సినిమా మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు, తర్వాత ఆగస్టు 27కి మార్చారు. కానీ టాలీవుడ్ స్ట్రైక్ వల్ల ఆ తేదీ కూడా కుదరలేదు. ఇప్పుడు దీన్ని దీపావళి సీజన్‌లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. “ఓలే ఓలే” పాట, టీజర్ ట్రెండింగ్ అవుతున్నాయి, ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటలు, ఎమోషనల్ డ్రామా మొత్తం కలిపి రవితేజ ‘మాస్ జాతర’ పండగ మూడ్‌లో ఆడియన్స్‌ని అలరించనుంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రచార చిత్రాలు మాస్ ప్యాన్స్ కు అంచనాలు పెంచేశాయి. సినిమా విడుదల కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మాస్ జాతర మూవీలోని 'ఓలే ఓలే' పాటతో వివాస్పదమైన నేపథ్యంలో హీరో రవితేజ స్పందించారు
కొన్ని పదాలనే పట్టుకొని చాలామంది మాట్లాడుతున్నారు.. కానీ పాటలో చాలా మీనింగ్ ఉంటుందని తెలిపారు pic.twitter.com/boIHWcs0XW
— ChotaNews App (@ChotaNewsApp) October 7, 2025
