Dacoit Fire Glimpse: అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ చిత్రం ‘డకాయిట్’. ఈ చిత్ర ఫైర్ గ్లింప్స్‌ను తెలుగ, హిందీలో భాషలలో మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో వచ్చిన ఈ ఫైర్ గ్లింప్స్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా గొప్ప థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోందనే విషయాన్ని ఈ ‘ఫైర్’ గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..
Also Read- AP Minister: సినిమా విడుదలకు ముందే హిట్టో ప్లాపో చెప్పేంత దైవాంశ సంభూతుడివా?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ మొదలైంది. సానుభూతితో నిండిన వాయిస్‌లో శేష్ ఆమెను ‘జూలియట్’ అని పిలుస్తాడు. అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు. ఆమె జాలీ చూపిస్తున్న కంఠం ఒక్కసారిగా మారిపోతుంది. నేను నిన్ను మోసగించడానికి రాలేదు, అంతకంటే ఎక్కువ చేస్తా.. అంటూ మిస్టీరియస్ స్మైల్‌తో శేష్ చెప్పే డైలాగ్ అదిరిపోవడమే కాదు, సినిమాలోని వైవిధ్యతను చాటుతోంది. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్‌లో ఖైదీ యూనిఫాం లో జైలు వ్యాన్‌లో వున్న శేష్.. కూల్‌గా తన నోటి నుండి ఒక కీ ని బయటకు తెస్తాడు. అదే సమయంలో ఓ రైలు వ్యాన్ మీదుగా దూసుకెళ్తుంది. చివరి సన్నివేశంలో, మృణాల్ అతని పక్కన కూర్చుని ఉండగా, శేష్ ఫైరింగ్ చేస్తాడు. ప్రేమ, ప్రతీకారం, మోసంతో నిండిన ఓ విభిన్నమైన కథకు ఇది నాంది అనేలా గ్లింప్స్ ఆకర్షిస్తోంది.
Also Read- Natti Kumar: పవన్ కళ్యాణ్ సినిమాపై పేర్ని నాని కుట్ర.. కేసు పెట్టాల్సిందే!
ఇక విజువల్‌గా ఈ ‘డకాయిట్ ఫైర్ గ్లింప్స్’ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందనే చెప్పుకోవాలి. అడివి శేష్ ఇంటెన్స్ అండ్ రగ్గడ్ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. అలాగే మదనపల్లె యాసలో అదరగొట్టాడు. అతని వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. హిందీ వెర్షన్‌కు కూడా తనే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆ గ్లింప్స్ కూడా అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు నటించని ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని ఇందులో పోషిస్తుందనే విషయం వెల్లడవుతోంది. ఆమె పాత్ర వెనక కథ చాలా ఆసక్తి కలిగిస్తుండగా.. అనురాగ్ కశ్యప్ ప్రజెన్స్ ఇంపాక్ట్ ఫుల్‌గా వుంది. దర్శకుడు షానియల్ డియో విజువల్ ప్రజెంటేషన్‌తో ఒక్కసారిగా అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఈ గ్లింప్స్ సినిమా స్కేల్ ఎంత బిగ్గరగా వుంటుందో తెలియజేసింది. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేస్తూ గ్లింప్స్ స్థాయిని పెంచింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు