Natti Kumar: సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు మీడియా సమావేశం నిర్వహించి తనదైన తరహాలో మాట్లాడే నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)పై కక్షతో, ఆయన నటించిన సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) పై వైసీపీ నాయకుడు, మాజీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నాని (Perni Nani) కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Also Read- Dil Raju: సమస్య మొదలైంది అక్కడే! పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా సెన్సార్ జరుపుకోలేదు, థియేటర్లలో విడుదల కాలేదు. అలాంటప్పుడు వైసీపీ నేత పేర్ని నాని ఆ సినిమాను ఫ్లాప్ సినిమా అంటూ ఎలా కామెంట్స్ చేస్తారు. ఒక సినిమా పూర్తి కావాలంటే ఎంతో మంది కళాకారుల, సాంకేతిక నిపుణుల శ్రమ, క్రియేటివిటీ అందులో దాగి ఉంటుంది. నిర్మాతలు కోట్లాది రూపాయల బడ్జెట్‌ను సినిమా కోసం వెచ్చించడం జరుగుతుంది. అయితే పేర్ని నాని మాత్రం కేవలం కుట్ర, కక్ష పూరితంగా సినిమాను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ కాకముందే, పోయే సినిమా అంటూ కామెంట్స్ చేసే రైట్స్ ఆయనకు ఎవరు ఇచ్చారు? దీనిపై చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం వెంటనే కేసు పెట్టాలి.
Also Read- Kandula Durgesh: టాలీవుడ్‌లో కొందరు అహంభావంతో మాట్లాడుతున్నారు.. అది కరెక్ట్ కాదు
ఇకపై విడుదల కాబోయే సినిమాలపై పేర్ని నాని మాదిరిగా ఇంకెవరూ విష ప్రచారం చేయకుండా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ కుట్రపై ప్రభుత్వం తగిన విచారణ జరిపి, పేర్ని నానిపై కఠిన చర్యలు చేపట్టాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాల్సిన అంశాన్ని పబ్లిక్‌లో పెట్టి, నానా రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు ఇచ్చిన పిలుపు.. ఇండస్ట్రీని షేక్ చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఇన్నాళ్లూ కామ్‌గా ఉండి, పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న సమయంలోనే ఇలాంటి మాటలు రావడంతో.. ఏపీ డిప్యూటీ సీఎం ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరపు నుంచి సినిమా ఇండస్ట్రీకి చిన్నపాటి వార్నింగ్‌లు కూడా వెళుతున్నాయి. ఇక ఇదే సమయం అనుకున్న పేర్ని నాని, పోయే సినిమాకు ఇంత హడావుడి ఎందుకు అనేలా? ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు