Mutton Soup Teaser: చాలా వైవిధ్యమైన టైటిల్‌తో వస్తున్న ‘మటన్ సూప్’ (Mutton Soup) సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని అన్నారు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై.. రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి రూపొందిస్తోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దసరాను పురస్కరించుకుని బుధవారం (అక్టోబర్ 1) ‘మటన్ సూప్’ టీజర్‌ను అనిల్ రావిపూడి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Mass Jathara: ఫైనల్‌గా ‘మాస్ జాతర’ రిలీజ్ ఎప్పుడంటే.. ఆసక్తికర వీడియో వదిలిన మేకర్స్!
టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది
ఈ టీజర్ విడుదల అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘మటన్ సూప్’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీనిని కూడా టైటిల్‌గా పెట్టవచ్చా? అని నేనే ఆశ్చర్యపోయాను. అలాగే నేను రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అనేంతగా ఈ టీజర్ కట్ చేశారు. టీమ్ అంతా చాలా కొత్తగా కనిపిస్తోంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, ఇంకా ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ, టీమ్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడికి నిర్మాత మల్లిఖార్జున ఎలికా, రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి ధన్యవాదాలు తెలిపారు.
Also Read- ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు
మా అదృష్టంగా భావిస్తున్నాం
చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి (Director Ramachandra Vattikuti) మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరైన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మా టీజర్‌ను లాంఛ్ చేయడమనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా విషయంలో మా నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ అందించారు. నటుడిగా రమణ్‌కు చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబుకు థాంక్స్. ఇందులో నటించిన గోవింద్, జెమినీ సురేష్‌లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకు థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా హీరో రమణ్, నటులు జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాకు పెద్ద విజయాన్ని అందించాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు