Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara) విడుదలకు సంబంధించి ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్స్ వచ్చాయి. కానీ, చివరి నిమిషంలో వాయిదా అంటూ కూడా మూడు సార్లు మేకర్స్ తెలియజేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఫ్యాన్స్ ఒత్తిడి మొదలైంది. ఇంకెప్పుడు, ఇంకెప్పుడు అంటూ నిర్మాణ సంస్థను టార్గెట్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక వారి బాధను భరించలేక ఫైనల్‌గా చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈసారి పక్కాగా విడుదల ఉంటుంది, ఇక వాయిదా అనే మాటే ఉండదు అని చెబుతూ.. సరదాగా ఓ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో మాస్ మహారాజా రవితేజ, హైపర్ ఆది మధ్య సంభాషణ (Ravi Teja and Hyper Aadi) ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఫ్యాన్స్‌కు కూడా రిలీజ్ డేట్ విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లయింది.
Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీమియర్ షోస్ రద్దు.. కారణమిదే!
సంక్రాంతి, సమ్మర్, వినాయక చవితి.. (Sankranthi 2025, Summer Holidays, and Vinayaka Chavithi)
తాజాగా మేకర్స్ వదిలిన ఈ వీడియోలోని మ్యాటర్ విషయానికి వస్తే.. ‘‘సంక్రాంతి అయిపోయింది.. సమ్మర్ అయిపోయింది.. వినాయక చవితి అయిపోయింది.. మాస్ జాతర ఇంకెప్పుడు?’’ అనే పోస్ట్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఈసారి మాత్రం రిలీజ్ పక్కా అనేలా వదిలిన ఈ వీడియోలో.. రవితేజ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే.. హైపర్ ఆది వచ్చి.. హాయ్ అన్నా అని పరిచయం చేసుకున్నారు. ‘మాస్ జాతర’ సినిమా చాలా బాగా వస్తుంది.. రిలీజ్ ఎప్పుడన్నా? అని ఆది ప్రశ్నిస్తే.. ‘సంక్రాంతికి, తెలియదా నీకు?’ అని రవితేజ క్లారిటీ ఇవ్వగానే మంచి పండుగ సినిమా అని ఆది అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పిన తర్వాత.. మళ్లీ ఆది వెళ్లి రవితేజని కలిశారు. ‘హ్యాపీ సంక్రాంతి అన్నా’ అని ఆది అనగానే.. ‘ఆది.. అది ఏమైందంటే.. సాంగ్ చేస్తుండగా ఇంజురీ అయ్యింది. మధ్యలో సర్జరీ.. అందుకే లేటయింది.. ఇప్పుడు చెబుతున్నానుగా.. మే 9 విడుదల’ అని చెప్పగానే ఆది, ఎగ్జయిట్ అవుతూ.. ‘ఫిక్సా అన్నా’ అనగా 100 పర్సంట్ అని రవితేజ క్లారిటీ ఇచ్చేశారు. ‘సమ్మరు.. పిల్లలు, ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారు.. థ్యాంక్యూ అన్నా’ అని వెళ్లిపోయారు.
Also Read- Allu Sirish: నయనికతో నిశ్చితార్థం.. అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్
వినాయకుడి మీద ఒట్టు.. ఈసారి పక్కా
మే 9 వేసవి సెలవుల్లో మళ్లీ రవితేజ ఇంటికి వచ్చిన ఆది.. ‘మే లో విడుదల కాలేదుగా’ అని అనగానే.. ‘ఏమైందంటే.. ఓ ఫైట్ సీక్వెన్స్‌లో కాలు ఇంజురీ అయ్యింది. ఇన్ని ఇంజురీలు ఎప్పుడూ అవ్వలేదు నాకు. ఏం చేయను.. వినాయక చవితి.. ఆగస్ట్ 27.. ఇది ఫిక్స్. ఇక మార్పు లేదు.. ఫుల్ ఫిట్, పర్ఫెక్ట్’ అని రవితేజ చెప్పగానే.. ‘వినాయక చవితి అంటే కుర్రాళ్లందరూ రెడీగా ఉంటారు అన్నా.. థ్యాంక్యూ అన్నా’ అని చెప్పి ఆది వెళ్లిపోయారు. మళ్లీ వినాయక చవితి రోజు, ఓ వినాయకుడి విగ్రహాన్ని పట్టుకుని రవితేజ ఇంటికి ఆది రాగానే, ఆయనని చూసి ‘ఓరినీ’ అని సైడ్‌కి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు రవితేజ. ఆది చేతిలోని వినాయకుడికి నమస్కరించిన రవితేజ, నిర్మాతతో ఫోన్ మాట్లాడి అక్టోబర్ 31, వినాయకుడి మీద ఒట్టు అని.. ఈసారి పక్కాగా వస్తుందని ఆదికి రవితేజ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజ సరసన శ్రీలీల (Sreeleela) ఇందులో నటిస్తోంది.
Sankranthi Ayipoyindhi,
Summer Ayipoyindhi,
Vinayaka Chavithi Ayipoyindhi…#MassJathara Yepudu? 🤔Eesari matram release pakkaa!! 💥😎
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/8V86FiYAkX
— Sithara Entertainments (@SitharaEnts) October 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు