Vedika: హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ బ్యూటీ సోషల్ మీడియా విమర్శకులపై, నెటిజన్లపై ఘాటుగా స్పందించారు. హీరోయిన్ అనగానే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటారని, ఇప్పటికైనా ఈ తీరు మారాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ఈ భామ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేదిక సోషల్ మీడియాలో హీరోయిన్లపై చేసే అసభ్యకరమైన కామెంట్స్ గురించి మండిపడ్డారు. ” కారణం లేకుండా క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తారు. కాస్త గ్లామరస్‌గా కనిపిస్తే చాలు, వేలెత్తి చూపడానికి రెడీ అవుతారు ” అని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.
హీరోయిన్ల పై విమర్శలు కొత్తేమీ కాదు కానీ, గ్లామరస్ దుస్తులు ధరిస్తే వారి వ్యక్తిత్వాన్నే తప్పుబట్టడం ఆమెకు తీవ్ర బాధ కలిగించింది. ” హీరోయిన్ల దుస్తుల గురించి మాట్లాడే ఈ దుస్థితి మారాలి. నేను బికినీ వేసుకొని నటించడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు నా విలువ తెలుసు. మారాల్సింది నేను కాదు, మీ ఆలోచనలు మారాలి. ” అంటూ వేదిక స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే వేదిక ఇలా మాట్లాడటంతో ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
వేదిక గురించి చెప్పాలంటే, మహారాష్ట్రకు చెందిన ఈ 37 ఏళ్ల బ్యూటీ ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.