The 100 Trailer Launch
ఎంటర్‌టైన్మెంట్

The 100: ఆర్కే సాగర్ ‘ది 100’కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ సపోర్ట్!

The 100: ‘మొగలి రేకులు’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సపోర్ట్ అందిస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి, తన పార్టీ మెంబర్‌కి సపోర్ట్ ఇవ్వగా.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన సపోర్ట్‌ని ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 6, ఆదివారం సాయంత్రం హైదరాబాద్, పార్క్ హయత్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read- Tharun Bhascker: ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. రూరల్ పాత్రల్లో! టైటిల్ ఏంటంటే?

ఇక ట్రైలర్ లాంచ్ విషయానికి వస్తే.. థియేట్రికల్ ట్రైలర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. దీంతో ఈ సినిమాకు ఎక్కడా లేని హైప్ వచ్చింది. ఈ హై ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌‌కు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని యాక్షన్ సీన్లు చూస్తుంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Also Read- Abhishek Bachchan: ఐష్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే!

ట్రైలర్‌ని గమనిస్తే.. ‘‘జీవితంలో జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం’’ అనే విక్రాంత్ ఐపీఎస్ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదనే రూల్ పెట్టుకున్న ఐపీఎస్ ఆఫీసర్ దానిని ఏ పరిస్థితుల్లో వాడాల్సి వచ్చిందనే కథాంశంతో కథనం సాగుతుంది. ఆయుధం వాడని ఓ పోలీస్ ఆఫీసర్ తనని తాను ఎలా ఆయుధంగా మలుచుకోవడం ప్రారంభించాడు అన్నదే ఈ సినిమా కథ. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలను విజయ్ మాస్టర్ మలచిన తీరు అందరినీ ఆకర్షిస్తుంది. విక్రాంత్ జీవితంలో ఎదురైన ఓ కేసు వల్ల డిపార్ట్‌మెంట్ తనపై ఎందుకు ఆరోపణలు చేసింది? ఆ ఆరోపణలను ఎలా ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ది 100’ సినిమా. ఆర్‌కె సాగర్.. విక్రాంత్ ఐపీఎస్‌ పాత్రలో ఒదిగిపోయారు.

దర్శకుడు రాఘవ్ ఓంకార్ ‘ది 100’ చిత్రాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పవర్ ఫుల్ సంగీతం యాక్షన్‌ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. సుధీర్ వర్మ పెరిచర్ల డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. మిషా నారంగ్ హీరోయిన్‌గా కనువిందు చేయనుంది. ధన్య బాలకృష్ణ, గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప, వంశీ నెక్కంటి, టెంపర్ వంశీ తదితరులు సినిమాలోని ఇతర తారాగణం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Adivasi Protest: లంబాడీలకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

Gummadi Narsaiah: నిజాయితీకి మారుపేరైన ఈ ఎమ్మెల్యే బయోపిక్ చేయడానికి తెలుగులో హీరోలే లేరా?

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?