Abhishek and Aishwarya rai
ఎంటర్‌టైన్మెంట్

Abhishek Bachchan: ఐష్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే!

Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. అప్పుడు అభిషేక్ బచ్చన్ ఖండించారు. ఆ తర్వాత కొన్ని ఈవెంట్స్‌లో వారిద్దరూ కలిసి కనిపించి.. అలాంటిదేమీ లేదని తెలియజేశారు. మరోసారి ఇప్పుడు విడాకులంటూ తీవ్ర స్థాయిలో వార్తలు సంచరిస్తున్నాయి. ఈ రూమర్స్‌‌పై మరోసారి అభిషేక స్పందించారు. వార్తలు అలా వ్యాపిస్తున్నా.. అటు అభిషేక, ఇటు ఐశ్వర్య ఎవరూ.. ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. తాజాగా ఈ విషయంపై అభిషేక్‌ బచ్చన్‌ మౌనం వీడారు. సోషల్ మీడియాను వీలైనంత తక్కువగా వాడతానని, వాటిలో వచ్చే ప్రచారాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వనని ఆయన సమాధానం ఇచ్చారు. ఆన్‌లైన్‌లో వచ్చే పోస్టులు, కామెంట్స్‌ తమపై ఏ మాత్రం ప్రభావం చూపించవని, వాటికి తమ కుటుంబం వీలైనంత దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాంటి వార్తలు ఎవరు వైరల్ చేస్తారో వారే దానికి బాధ్యత వహించాలన్నారు. రూమర్ల విషయంలో తాను చాలా తక్కువగా స్పందిస్తానని చెప్పుకొచ్చారు.

Also Read- Perni Nani: పవన్ కళ్యాణ్‌ను పేర్ని నాని ఇంత మాట అన్నారేంటి?

ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. మా పనికి సంబంధించిన చాలా విషయాల గురించి మా కుటుంబమంతా చర్చించుకుంటాం. అలా అని వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వం. ఇంకా వేరే విషయాల గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇక రూమర్స్ విషయంలో చాలా పొదుపుగా మాట్లాడతాను. సినీ రంగానికి చెందిన కుటుంబంలో ఉండటం వల్ల ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి, ఎలాంటి విషయాలను వదిలేయాలనే దానిపై నాకొక అవగాహన ఉంది. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు మా కుటుంబంపై ఏరకంగానూ ప్రభావం చూపించవని అన్నారు. ఇంట్లో ఆడవారు ఎవరూ బయట విషయాలు కుటుంబంలోకి తీసుకురారని, అలాంటి సంద్భాలు లేవని అభిషేక్‌ బచ్చన్‌ తెలిపారు.

Also Read- Sapthami Gowda: ‘ముక్కుపుడక’ విశిష్టత చెప్పిన ‘కాంతార’ బ్యూటీ!

అంతే కాకుంగా ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 1995లో స్విట్జర్లాండ్‌లో మొదటిసారి ఐశ్వర్యను కలిశానని అన్నారు. నాన్నతో ఓ సినిమా షూట్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లినప్పుడు.. బాబీ డియోల్ వల్ల ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. బాబీ డియోల్, ఐశ్వర్య ఓ సినిమా షూట్‌ కోసం అక్కడికి వస్తే.. వారితో కలిసి డిన్నర్‌ చేశామని గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఐశ్వర్యతో చాలా మాట్లాడానని చాలా కాలం తర్వాత అవేమీ అర్థం కాలేదని చెప్పారని అన్నారు. ఇదే సందర్భంలో కుమార్తె ఆరాధ్య గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆరాధ్యకు ఇప్పటి వరకు ఫోన్ లేదని, ఆమె విషయంలో అందరం ఎంతో సంతోషంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ ఆరాధ్యకు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లోనూ ఖాతా లేదని, ఆమె వ్యక్తిత్వానికి తాము ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదని అన్నారు. ఆరాధ్యను పెంచడంలో క్రెడిట్ మొత్తం ఐశ్వర్యకే చెందుతుందని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా అభిషేక్, ఐశ్వర్యలు విడివిడిగా పలు కార్యక్రమాలకు హాజరవడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇలాంటి రూమర్లపై వారు సరిగా స్పందించకపోవడంతో వాటికి మరింత బలం పెరిగింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!