Vishwambhara Poster
ఎంటర్‌టైన్మెంట్

Vishwambhara: ఎట్టకేలకు అప్డేట్.. మెగా ఫ్యాన్స్ ఇక చూసుకోండమ్మా!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ( Vassishta) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఒకే ఒక్క టీజర్.. సినిమాపై ట్రోలింగ్‌కు కారణమవడంతో, చిత్రటీమ్ అలెర్ట్ అయింది. అందుకే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి, దిద్దుబాబు చర్యలు చేపట్టారు. అందుకే చిత్ర విడుదలపై కానీ, చిత్ర అప్డేట్ గురించి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అప్డేట్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read- Pawan Kalyan Son Health: నాకేం కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను.. మార్క్‌ శంకర్‌!

ఎందుకంటే, సంక్రాంతికి సినిమా మొత్తం పూర్తయిందని చెప్పారు. కాకపోతే, రామ్ చరణ్ కోసం వాయిదా వేసుకున్నట్లుగా చెప్పారు. మరి పూర్తయిన సినిమాను విడుదల చేయడానికి, విడుదల తేదీ ప్రకటించడానికి టీమ్ ఎందుకు ఆలోచిస్తుందనేది ఇంత వరకు తెలియరాలేదు. సినిమా షూటింగ్ పూర్తయిందని పేరుకే చెప్పినట్లు ఉన్నారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నారు. ఇలా ఎన్నో అనుమానాలు ఈ సినిమాపై ఉన్న నేపథ్యంలో మేకర్స్ మరోసారి అలెర్ట్ అయ్యారు. సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. (Vishwambhara First Single Update)

హనుమంతునికి తన ప్రభువు శ్రీ రాముడి పట్ల ఉన్న ప్రేమ, గౌరవానికి చిహ్నంగా ‘విశ్వంభర’లో ఓ సాంగ్ ఉన్నట్లుగా తెలుపుతూ.. హనుమాన్ జయంతి స్పెషల్‌గా ఏప్రిల్ 12న చిత్ర ఫస్ట్ సింగిల్‌‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది. హనుమాన్ గెటప్‌లో ఉన్న పిల్లల్ని చిరంజీవి తన భుజంపై ఎక్కించుకుని చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ‘రామ రామ’ అంటూ సాగే పాటను ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి కంపోజ్ చేయగా, సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించినట్లుగా ఈ ఆప్డేట్‌లో తెలియజేశారు. పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- NTRNeel: ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ఇక ఈ అప్డేట్‌లో మెగా ఫ్యాన్స్‌లో కూడా హుషారు వచ్చేసింది. హమ్మయ్యా.. ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసిందని, మెగా ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కేశారు. ఈ అప్డేట్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!