Pawan Kalyan Son Health: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. సింగపూర్‌కు వెళ్లిన పవన్.. మార్క్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శంకర్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నట్లు పవన్‌కు వివరించారు.
అయితే మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. శంకర్‌కు తొలుత అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు ఉదయం సాధారణ వార్డుకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫొటో బయటికొచ్చింది. ఆ ఫొటోలో ‘నాకేం కాలేదు.. నేను ఆరోగ్యంగా ఉన్నాను’ అన్నట్లు చేతులతో శంకర్ సైగ చేశాడు.
Also read: Pawan Kalyan son: పవన్ వద్దకు అడవి తల్లి.. వీడియో వైరల్..
కాగా, సమ్మర్‌క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో శంకర్‌కు కాళ్లు, చేతులకు గాయాలు కావడం ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో అస్వస్థతకు గురైన మార్క్‌ను అత్యవసరం విభాగంలో చేర్పించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్, సోదరుడు చిరంజీవి దంపతులు విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదానికి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సింగపూర్ అధికారులు వెల్లడించారు.