NTRNeel: ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్
Jr ntr and Neel
ఎంటర్‌టైన్‌మెంట్

NTRNeel: ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ (Man Of Masses Jr NTR) కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కెజియఫ్’ (KGF) సిరీస్ చిత్రాలు, ‘సలార్’ (Salaar) వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్ నీల్’ పేరుతో గత ఏడాదిలో పూజా కార్యక్రమాలను జరుపుకుని, ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన షూటింగ్‌లో అందరూ ఆశ్చర్యపోయేలా 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరపగా.. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా షూట్‌లో ఎప్పుడు జాయిన్ అవుతారనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Breaking News: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు ఇప్పుడెలా ఉందంటే..

‘ఎన్టీఆర్ నీల్’ సినిమా షూటింగ్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి తారక్ (Tarak) షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుపుతూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో ప్రస్తుతం ఎన్టీఆర్‌నీల్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి.

ఇంకా చెప్పాలంటే అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ భారీ పాన్ ఇండియా చిత్రం 9 జనవరి, 2026లో (NTRNeel Movie Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుందని, ప్రారంభం రోజే మేకర్స్ ప్రకటించారు. ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం సినిమా షూటింగ్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వైరల్ చేస్తూనే ఉన్నారు.

Also Read- Renu Desai: పొలిటికల్ ఎంట్రీ.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

తార‌క్‌తో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ప్రశాంత్ నీల్, ఈ చిత్రాన్ని సరికొత్త మాస్ విజన్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తారక్‌ను చూడనటువంటి ఊర మాస్ అవతార్‌లో ప్రెజంట్ చేయనున్నారనే విషయం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో తెలిసిపోయింది. ప్రెస్జీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) నిర్మాణంలో కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతాన్ని సమకూరుస్తున్నఈ ప్రెస్టీజియస్ మూవీలో ఇంకా టాప్ యాక్టర్స్, టెక్నీషియన్స్ ఎందరో భాగం కానున్నారని తెలుస్తుంది. వారి వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!