Mana Shankara Vara Prasad Garu: మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి, మేకర్స్ తాజాగా స్టైలిష్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ఆదివారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా నిలుస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ, చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించిన ఈ క్లైమాక్స్ షూటింగ్ అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
Also Read- Bigg Boss Telugu 9: నేషనల్ క్రష్మిక ఎంట్రీ.. తనూజకు తలంటేసిన నాగ్.. గోల్డెన్ బజర్ ట్విస్ట్!
వెంకటేష్ జాయినింగ్‌తో ఊపందుకున్న షూటింగ్
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఇటీవల విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో జాయిన్ అయిన విషయం తెలిసిందే. వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మల్టీస్టారర్ ఎలిమెంట్, సినిమాకు అదనపు బలం చేకూర్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరు, విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కాంబినేషన్ అంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా వచ్చిన ఈ షూటింగ్ అప్డేట్‌తో పాటు, గతంలో విడుదలైన చిత్రంలోని తొలి పాట ‘మీసాల పిల్ల’ సాధించిన ఘనత కూడా మరోసారి వార్తలలో నిలుస్తుంది. ఈ పాట 40 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి, చార్ట్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, చిరంజీవి గ్రేస్, మాస్ టచ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
Also Read- Prasanth Varma: రెండు వైపులా విషయం తెలుసుకోండి.. మీడియా సంస్థలపై చురకలు!
స్టైలిష్ క్లైమాక్స్
క్లైమాక్స్ షూటింగ్ వివరాలను వెల్లడిస్తూ, మేకర్స్ ప్రత్యేకంగా ఆ సన్నివేశాల గురించి ప్రస్తావించారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ప్రతి సన్నివేశం చాలా గ్రాండ్‌గా, విజువల్‌గా అద్భుతంగా రూపొందుతోందని తెలిపారు. చిరంజీవి చరిష్మా, గ్రేస్, అనిల్ రావిపూడి వినోదాత్మక టచ్ కలగలిసిన ఈ క్లైమాక్స్ సీక్వెన్స్, ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్‌ను కూడా రానుందని తెలుస్తుంది. ఈ సెకండ్ సింగిల్‌కు సంబంధించి వినిపిస్తున్న వార్తల ప్రకారం.. రమణ గోగుల ఈ పాటను పాడనున్నారని తెలుస్తోంది. ‘మీసాల పిల్ల’ సాంగ్‌ని ఉదిత్ నారాయణ్ పాడిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
