Chiranjeevi: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ఆనందంతో వెల్లివెరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్ (Murali Mohan), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)లు పద్మశ్రీ (Padma Shri) అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). అవును, చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి, వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం.. ఒక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు తన సహ నటులకు పద్మశ్రీ పురస్కారం వరించడాన్ని.. ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజుగా అభివర్ణించారు.
Also Read- Ranabaali: విజయ్ దేవరకొండ VD14 టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అరాచకం అంతే!
పద్మ అవార్డుల విజేతలకు అభినందనలు
ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, ఒకరికొకరు జ్ఞాపకాలు పంచుకోవడం, దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డులు (Padma Awards 2026) పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్‌తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన విషయం తెలిసిందే. చిరంజీవి తన పోస్ట్‌లో.. ‘‘విశిష్ట వ్యక్తులను సత్కరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ధర్మజీకి పద్మ విభూషణ్.. మై డియర్ మమ్ముట్టి, డాక్టర్ దత్తాత్రేయుడు నోరిలకు లభించిన పద్మ భూషణ్.. ఇవన్నీ దశాబ్దాల పాటు వారు చూపిన అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, మన చాంపియన్ రోహిత్ శర్మ, అలాగే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించి, 2026 సంవత్సరపు పద్మ అవార్డు పొందిన గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు.
Also Read- Poonam Kaur: పవన్ కళ్యాణ్‌కు ఆ అర్హత లేదు.. పూనమ్ షాకింగ్ పోస్ట్!
సహచరుల పట్ల ప్రేమని చాటుతూ..
సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. తన సహ నటులైన మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల ఇంటికి వెళ్లి మరీ వారిని చిరు సత్కరించడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది చిరంజీవి పెద్ద మనసుకు, గొప్ప మనసుకు నిదర్శనం అని ఆయనను అభిమానించే వారంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించేలా ఇలాంటి ముందడుగులు వేయడం.. నిజంగా ప్రశంసనీయమనే చెప్పాలి. ఎప్పటిలాగే సహచరుల పట్ల ప్రేమని చాటుతూ, ప్రతి సందర్భంలోనూ ఒక ఆత్మీయ పెద్దగా ఇండస్ట్రీకి అండగా నిలుస్తూ.. చిరంజీవి తన గొప్ప మనసు మరోసారి చాటారు. అందుకే.. ఇది మా అన్నయ్య అంటే.. అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Honouring such distinguished individuals brings great pride and joy…
Sri Dharamji’s Padma Vibhushan, my dear @mammukka and Dr Dattatreyudu Nori garu’s Padma Bhushan are recognitions earned through decades of dedication, excellence and grace.
Very happy to see dear friends…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

