Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో పద్దెనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా మెగా స్టార్ చిరంజీవి చరణ్ కు అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఏం ఉందంటే.. ‘చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. దీనిని చూసిన అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Read also-TVK rally stampede: కరూర్ ఘటనపై దళపతి ఎమోషనల్ పోస్ట్.. వారికి సాయం ప్రకటన..
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మెగా స్టార్ ఎలా ఆవిర్భవిస్తాడో, ఆయన ఎలా ఒక ఐకాన్‌గా మారతాడో అనేది రామ్ చరణ్ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. 2007లో ‘చిరుత’తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ మెగా పవర్ స్టార్, ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. ఈ 18 ఏళ్లలో, చరణ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా, డాన్సర్‌గా, ప్రొడ్యూసర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనదైన ముద్ర వేశాడు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా జన్మించినప్పటికీ, స్వశక్తితో ముందుకు సాగాడు. 2007లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘చిరుత’ అతని డెబ్యూ సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌గా నిలిచింది. చరణ్‌కు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చేలా చేసింది.
2022లో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమాతో రామ్ చరణ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ఈ చిత్రం, భారతీయ సినిమాల్లో మూడో అత్యధిక గ్రాస్ చేసింది. చరణ్‌కు మూడో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్, క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డ్స్ నామినేషన్ వచ్చాయి. అల్లూరి క్యారెక్టర్, ‘నాటు నాటు’ డాన్స్ ఇవన్నీ గ్లోబల్ హిట్స్ గా నిలిచాయి. అదే సంవత్సరం ‘ఆచార్య’లో తండ్రి చిరంజీవితో కలిసి చరణ్ నటించారు. 2025లో వచ్చిన ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపినింగ్ సాధించినప్పటికీ ఆ తర్వాత ఎందుకో ముందుకు సాగలేదు. చరణ్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు. 2016లో కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి, ‘ఖైదీ నెం.150’ (2017), ‘సైరా నరసింహ రెడ్డి’ (2019) లాంటి చిత్రాలు నిర్మించారు. సినిమా పరిశ్రమలో చరణ్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ 18 ఏళ్లు సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
చరణ్ బాబు,
18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.
నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025