Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్.. సినిమాపై బీభత్సమైన హైప్‌ని పెంచేస్తుంది. అందులోనూ సంక్రాంతి సెంటిమెంట్‌తో వరుస విజయాలను అందుకున్న అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయడంతో.. మరో హిట్ పక్కా అనేలా అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. అదేంటంటే.. (Mana Shankara Vara Prasad Garu Update)
Also Read- OTT Movies: ఓటీటీ లవర్స్ కి పండగే.. ఆ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి.. చూసేందుకు మీరు సిద్ధమేనా?
సాంగ్ చిత్రీకరణలో..
ప్రస్తుతం హీరోహీరోయిన్లు అయినటువంటి చిరంజీవి, నయనతార (Nayanthara) పై హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ అనంతరం నేటి (సోమవారం) నుంచి హైదరాబాద్‌లో ఓ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. చార్ట్‌బస్టర్, మాస్-అప్పీల్ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారని తెలుస్తోంది. ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ పాట మళ్లీ వింటేజ్ చిరంజీవిని తలపిస్తుందని, కూల్ స్టెప్స్‌తో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యేలా విజయ్ పోలంకి మాస్టర్ చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర బృందం చెబుతోంది.
స్టైలిష్ అవతార్‌లో
ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, వినాయక చవితి స్పెషల్ పోస్టర్ అద్భుతమైన స్పందనను అందుకున్న విషయం తెలియంది కాదు. చిరంజీవిని స్టైలిష్ అవతార్‌లో ప్రజెంట్ చేయడం అభిమానులని అలరించింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ మిస్ అవుతున్న చిరుని అనిల్ రావిపూడి తెరపై చూపించబోతుండటంతో.. మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అందుకే ఎటువంటి అప్డేట్ వచ్చినా.. క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాన్ని 2026 సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసే సినిమాలు ఇలా ఉన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమాతో పాటు ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీకి చిరు కమిట్ అయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు