Bigg Boss 9 Contestants
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ (Bigg Boss Telugu Season 9) ఆదివారం (Sep 7) గ్రాండ్‌గా మొదలైంది. హౌస్‌లోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌ని పంపించారు. అందులో 6 కామనర్స్‌కు చోటు కల్పించారు. సెలబ్రిటీలకు వచ్చిన వారిలో హీరోయిన్ సంజన, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, నటి రీతూ చౌదరి, నటుడు సుమన్ శెట్టి, భరణి వంటి వారితో పాటు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..

Also Read- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

1వ హౌస్‌మేట్: తనూజ (Thanuja Puttaswamy)
2వ హౌస్‌మేట్: ఆషా షైనీ (ఫ్లోరా షైనీ) (Flora Saini)
3వ హౌస్‌మేట్‌గా కామనర్: కళ్యాణ్ పడాల (Kalyan Padala)
4వ హౌస్‌మేట్‌: జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ (Emmanuel)
5వ హౌస్‌మేట్‌: కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma)
6వ హౌస్‌మేట్‌‌గా కామనర్: మాస్క్ మ్యాన్ హరీష్ (Harita Harish)
7వ హౌస్‌మేట్‌‌: నటుడు భరణి (Bharani Shankar)
8వ హౌస్‌మేట్‌‌: రీతూ చౌదరి (Ritu Chaudhary)
9వ హౌస్‌మేట్‌ కామనర్‌: డీమాన్ పవన్ (Demon Pawan)
10వ హీరోయిన్ సంజన (Sanjjanaa Galrani)
11వ హౌస్‌మేట్‌: ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్ (Ramu Rathod)
12వ హౌస్‌మేట్‌‌గా కామనర్: దమ్ము శ్రీజ (Dammu Sreeja)
13వ హౌస్‌మేట్‌‌: సుమన్ శెట్టి (Suman Shetty)
14వ హౌస్‌మేట్‌గా కామనర్: ప్రియా శెట్టి (Priya Shetty)
15వ హౌస్‌మేట్‌గా కామనర్: మర్యాద మనీష్ (Maryada Manish)

Also Read- Teja Sajja: ‘మిరాయ్’ కన్నడ ఈవెంట్‌లో ‘ఓజీ’ అంటూ అరుపులు.. తేజ సజ్జా రియాక్షన్ ఇదే!

ఇందులో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్స్‌ని డబుల్ హౌస్‌లకు ఓనర్స్‌గా కింగ్ నాగార్జున ప్రకటించారు. మిగతా 9 మంది సెలబ్రిటీలను అద్దెకు ఉండే వారిగా ఎంపిక చేశారు. కామనర్స్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి వారు ఓనర్స్ అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇన్ హౌస్‌లో ఉండేది ఓనర్స్ (కామనర్స్) అయితే, అవుట్ హౌస్‌లో ఉండే వారు అద్దెకు ఉండేవారు (సెలబ్రిటీలు) అని లాస్ట్‌లో నాగార్జున చెప్పారు. అలాగే అద్దెకు ఉంటున్నందుకు రెంట్ ఏం చెల్లించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. సెలబ్రిటీలకు అసలు సిసలైన అగ్నిపరీక్ష మొదలైందని హింట్ ఇచ్చారు. అనంతరం రెండు హౌస్‌లను కింగ్ నాగ్ లాక్ చేశారు. మీ హౌస్‌తో పాటు మా హౌస్‌లపై కూడా కన్నేసి ఉంచండి అంటూ కింగ్ నాగార్జున్ చెబుతూ.. అందరికీ బై చెప్పారు. మొత్తంగా 15 మందిని హౌస్‌లోకి పంపించారు. తర్వాత మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంత మందికి హౌస్‌లోకి పంపిస్తారు? ఎవరిని పంపిస్తారు? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!