Teja Sajja: ఇప్పుడు ఎక్కడ విన్నా ‘ఓజీ’ (OG Movie) మాటే వినబడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ‘ఓజీ’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ప్రేక్షకులు ఎంతగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారనేది.. అందరికీ తెలిసిన విషయమే. ఓ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ (Mirai) హీరో తేజ సజ్జా (Teja Sajja)కు ‘ఓజీ’ సెగ తగిలింది. తేజ సజ్జా సూపర్ యోధగా నటించిన ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబర్ 12న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏరియాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. హీరో ధ్రువ సర్జా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Also Read- Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్
తేజ సజ్జాకు ‘ఓజీ’ సెగ
ఈ వేడుకలో తేజ సజ్జా మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ‘ఓజీ’, ‘ఓజీ’ అంటూ అరవడం మొదలెట్టారు. అంతే, ఒక్కసారిగా షాకైన తేజ సజ్జా.. వెంటనే తేరుకుని.. సెప్టెంబర్ 12న ‘మిరాయ్’ని థియేటర్లలో చూద్దాం. ఆ తర్వాత సెప్టెంబర్ 25న వస్తున్న ‘ఓజీ’ సినిమాను అందరం థియేటర్లలో సెలబ్రేట్ చేసుకుందాం. మీతో పాటు నేను కూడా సెప్టెంబర్ 25న ‘ఓజీ’ థియేటర్‌కి వచ్చేస్తా. ముందు ‘మిరాయ్’ వస్తుంది కాబట్టి.. ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. అంతే, ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. తేజ సజ్జా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విషయం తెలిసిందే. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియా శరణ్.. ‘మిరాయ్’ సినిమాలో తేజ సజ్జా మదర్ రోల్ పోషిస్తుండటం విశేషం.
Also Read- Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?
ఆయన నాకు లక్కీ చార్మ్
ఇక బెంగళూర్‌లో జరిగిన ‘మిరాయ్’ ప్రీ రిలీజ్ వేడుకలో తేజ సజ్జా మాట్లాడుతూ.. కన్నడ ప్రజలందరికీ నమస్కారం. ఇంత వానలో కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. మీరు చూపిస్తున్న ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను. మీ ప్రేమ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన యాక్షన్ ప్రిన్స్ ధ్రువ అన్నకి థాంక్యూ సో మచ్. ‘హనుమాన్’ సినిమాకు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన నాకు లక్కీ చార్మ్. ఈ సినిమాతో కూడా అది రిపీట్ కాబోతోందని నమ్మకంగా చెప్పగలను. ‘మిరాయ్’ యాక్షన్ అడ్వెంచర్స్ ఫాంటసీ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయదగ్గ సినిమా. అందరూ తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి, సపోర్ట్ చేస్తారని, సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇకపై నా సినిమాలన్నీ బెంగళూర్‌లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు