Samantha: తెలుగు నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో 90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, తన శారీరక బలాన్ని ప్రదర్శించింది. మొన్నటి వరకు సమంత హెల్త్ గురించి రక రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు సామ్ పూర్తి చేసిన ఛాలెంజ్ చూస్తే ఈమెనే మనం అన్ని మాటలు అన్నది అనుకుంటాము.
Also Read: Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్
ఈ చాలెంజ్‌లో ఒక హారిజాంటల్ బార్ నుండి కాళ్లను నేలకు తాకకుండా, చేతులతో 90 సెకన్ల పాటు వేలాడటం ఉంటుంది. సమంత తన ట్రైనర్స్ పవనీత్ ఛబ్రా, పరిధి జోషితో కలిసి ఈ ఫిట్‌నెస్ టాస్క్‌ను చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె గ్రిప్ స్ట్రెంగ్త్‌ను హైలైట్ చేస్తూ, “ఇది రూపం గురించి కాదు, జన్యుశాస్త్రం గురించి కాదు, కండరాలు లేదా ఫ్లెక్స్‌డ్ సెల్ఫీల గురించి కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనే దాని గురించి” అని క్యాప్షన్ ను జోడించింది. ఈ సందేశం శారీరక బలం, స్థిరత్వం అనేది రూపానికి మించినదని, నిజమైన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని ప్రేరేపించింది.
డెడ్ హ్యాంగ్ చాలెంజ్ గ్రిప్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించడమే కాకుండా, శరీర సమతుల్యత, ఓర్పు , కండరాల బలాన్ని కూడా పెంచుతుంది. నిపుణుల చెప్పిన దాని ప్రకారం , మహిళలు 90 సెకన్ల డెడ్ హ్యాంగ్‌ను లక్ష్యంగా చేసుకోవాలని, అయితే ఈ చాలెంజ్‌ను క్రమంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా సాధించవచ్చని చెబుతున్నారు. సమంత ఈ చాలెంజ్‌ను చాలా ఈజీగా పూర్తి చేయడం ఫ్యాన్స్ కి చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియ మహిళలను ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించింది, ముఖ్యంగా ఆమె గతంలో మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ తన ఫిట్‌నెస్ జర్నీని కొనసాగించడం ప్రశంసనీయం.