Bun Butter Jam Pic
ఎంటర్‌టైన్మెంట్

Bun Butter Jam: అన్‌స్టాప‌బుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. టీజర్ అదిరింది!

Bun Butter Jam: రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా రాఘ‌వ్ మిర్‌ద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ స‌మ‌ర్ప‌ణలో రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మించారు. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆల్రెడీ తమిళ్‌లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర టీజ‌ర్‌ను టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసి.. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుతూ.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

Also Read- Eye Care: వెచ్చని కంటి కాపడం, కాజల్ వాడకం మీ కళ్ళకి సురక్షితమేనా? కంటి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?

‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ టీజ‌ర్‌ (Bun Butter Jam Teaser) విషయానికి వస్తే.. త‌ల్లిదండ్రులైన చార్లి, పొన్‌వ‌న్న‌న్‌.. అబ్బాయి పుడితే చాలా గొప్ప అనే అనుకున్నాం కానీ.. ఇప్పుడు తెలుస్తుంది అంటూ టీజర్ మొదలైంది. తమ కొడుకు గొప్ప‌త‌నం గురించి మ‌రొక‌రితో ఫోన్‌లో చెబుతుంటే.. మ‌రో వైపు హీరో అదే తమ కొడుకు క్యారెక్ట‌ర్‌ను ఫ‌న్నీగా ప్ర‌జెంట్ చేశారు. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌ను చూపిస్తూనే, ఎంట‌ర్‌టైనింగ్ వేలోనే తండ్రీ కొడుకుల మధ్య బాండింగ్‌ని చూపించ‌టం కొస మెరుపు. స్వచ్ఛమైన ఎమోష‌న్స్, అన్‌స్టాప‌బుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ ప్రేక్ష‌కులను ఎంటర్‌టైన్ చేయబోతుందనే విషయాన్ని ఈ టీజర్ స్పష్టం చేస్తుంది. అందులోనూ తమిళ్‌లో విడుదలై మంచి విజయం సాధించింది కాబట్టి.. తెలుగులోనూ గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ టీజర్ కూడా ఆ నమ్మకాన్ని బలపరుస్తోంది.

Also Read- Saiyaara Movie: బాక్సాఫీస్ దూకుడు.. కేవలం 12 రోజుల్లోనే ‘ఛావా’ను బీట్ చేసిన ‘సయారా’!

ఈ సినిమాను రాఘ‌వ్ మిర్‌ద‌త్ తెరకెక్కించిన తీరు.. ప్రతి ఇంటిలో జరిగే సహజ సంఘటనలుగా ఉంటేనే, అందులో నుంచే కామెడీని తీసుకురావడం విశేషం అని చెప్పుకోవచ్చు. నివాస్ కె.ప్ర‌సన్న అందించిన సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్ర‌ఫీతో పాటు ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో విఘ్నేశ్వ‌ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సి.హెచ్‌. స‌తీష్ కుమార్ కూడా ఘన విజయం అందుకుంటాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆగస్ట్ 8న విడుదలయ్యేందుకు ఇప్పటికే చాలా సినిమాలు లైన్‌లోకి వచ్చేశాయి. ఈ భారీ పోటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. చార్లి, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్‌, దేవ‌ద‌ర్శిన‌, మైకేల్ తంగ‌దురై, విజె.ప‌ప్పు వంటి వారు ఈ చిత్రంలో ఇతర పాత్రలలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!