Saiyaara Movie
ఎంటర్‌టైన్మెంట్

Saiyaara Movie: బాక్సాఫీస్ దూకుడు.. కేవలం 12 రోజుల్లోనే ‘ఛావా’ను బీట్ చేసిన ‘సయారా’!

Saiyaara Movie: చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రొమాంటిక్ మూవీగా వచ్చిన ‘సయారా’ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో, ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాల కలెక్షన్స్‌ని ‘సయారా’ బీట్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. మరీ ముఖ్యంగా రీసెంట్ టైమ్‌లో బాలీవుడ్‌లో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న ‘ఛావా’ మూవీ ఇంటర్నేషనల్ స్థాయి కలెక్షన్లను.. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న కుర్ర హీరోహీరోయిన్లు ‘సయారా’తో బీట్ చేయడం విశేషం.

Also Read- Meenakshi Seshadri: స్లీవ్‌లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా?

వాస్తవానికి బాలీవుడ్‌కి ఈ మధ్య కాలంలో ఎప్పుడోగానీ హిట్ పడటం లేదు. ‘పఠాన్’, ‘జవాన్’ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఏదీ అంతా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. మళ్లీ ‘ఛావా’నే బాలీవుడ్‌కు ఊపిరి పోసింది. ఆ తర్వాత మళ్లీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘సయారా’ చిత్రమే బాలీవుడ్ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ‘సయారా’ విషయానికి వస్తే.. కేవలం 12 రోజుల్లోనే విక్కీ కౌశల్, రష్మికా మందన్నా కలిసి నటించిన ‘ఛావా’ అంతర్జాతీయ వసూళ్లను అధిగమించి సరికొత్త మైల్‌స్టోన్‌ని క్రియేట్ చేసింది.

‘సయారా’ అంతర్జాతీయ వసూళ్లు ‘ఛావా’ను అధిగమించాయని ట్రేడ్ రిపోర్ట్స్ కూడా వెల్లడిస్తున్నాయి. అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన ‘సయారా’ సినిమా.. విడుదలైన 12 రోజుల్లోనే రూ. 94 కోట్లు వసూలు చేసి.. విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ నటించిన ‘ఛావా’ సినిమా లైఫ్‌ టైమ్ అంతర్జాతీయ వసూళ్లైన రూ. 91 కోట్లను దాటేసింది. ఈ విజయంతో ‘సయారా’ 2025లో అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇతర బాలీవుడ్ చిత్రాల అంతర్జాతీయ కలెక్షన్స్‌ని ఒక్కసారి పరిశీలిస్తే.. హౌస్‌ఫుల్ 5 రూ. 70.25 కోట్లు, సితారే జమీన్ పర్ రూ. 66.75 కోట్లు, మర్డర్ ముబారక్ రూ. 54.00 కోట్లు గా నమోదయ్యాయి.

Also Read- Kalpika controversy: నటి కల్పికపై కేసు నమోదు.. కన్న తండ్రే..

ఒక్క బాలీవుడ్ అనే కాదు.. ‘సయారా’ చిత్రం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ అంతర్జాతీయ వసూళ్లైన రూ. 93.80 కోట్లను కూడా అధిగమించడం విశేషం. అంతర్జాతీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మోహన్‌లాల్ ‘L2: ఎంపురాన్’ (రూ. 124.50 కోట్లు) తర్వాత రెండో స్థానంలో ‘సయారా’ నిలిచింది. కొత్త నటీనటులైనా, ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి.

మహేష్ భట్ తీసిన ‘ఆషికి’ చిత్రంతో రాహుల్ రాయ్, అను అగర్వాల్‌లు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారనే విషయం తెలిసిందే. ఆషికి ఇప్పటికీ, ఎప్పటికీ ఇండియన్ స్క్రీన్స్‌పై ఓ ఎవర్ గ్రీన్ క్లాసికల్ లవ్ స్టోరీగా అలా నిలిచిపోతుంది. ఆషికి చిత్రానికి సంబంధించిన సంగీతం కూడా ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంటుంది. అదేవిధంగా యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో అహాన్ పాండే, అనీత్ పడ్డాలను పరిచయం చేస్తూ ‘సయారా’ చిత్రం వచ్చింది. ‘సయారా’ పాటలు కూడా బ్లాక్ బస్టర్‌లుగా నిలిచి చార్ట్ బస్టర్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!