Boman Irani: మా ఆవిడకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. స్టోరీ కూడా!
Boman Irani (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Boman Irani: మా ఆవిడకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. అందుకే ‘రాజా సాబ్’లో!

Boman Irani: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్టర్ మారుతి (Director Maruthi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ముంబైలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్‌లో ‘నాచె నాచె’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన బొమన్ ఇరానీ, జరీనా వహాబ్ వంటి సీనియర్ నటీనటులు హాజరయ్యారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ గురించి బొమన్ ఇరానీ (Boman Irani) చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ బొమన్ ఇరానీ ఏం చెప్పారంటే..

Also Read- Anasuya: నిన్న సారీ చెప్పి.. ఇప్పుడేంటి అలాంటి పోస్ట్ పెట్టింది

చిన్న పిల్లాడి మనస్తత్వం

‘‘ఒక రోజు నాకు డైరెక్టర్ మారుతి నుంచి కాల్ వచ్చింది. ఎవరు ఫోన్.. అని మా ఆవిడ అడిగింది. బాహుబలి ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీలో పాత్ర చేయాలంటూ ఫోన్ చేశారని చెప్పాను. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మూవీ చేస్తున్నానని చెప్పేయండి అని అంది. అలా ఎందుకు అందంటే.. ఆమెకు ప్రభాస్ అంటే అంత ఇష్టం. ఆమెకే కాదు, ప్రభాస్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. నేను కథ, క్యారెక్టర్ ఏంటని కూడా అడగలేదు. వెంటనే ఆయనకు సినిమా చేస్తున్నానని చెప్పా. ఇప్పటి వరకు వచ్చిన ‘రాజా సాబ్’ కంటెంట్ చూశారు కదా… ఎంతమంది కష్టపడితే ఇంత ఔట్ పుట్ వచ్చిందో ఊహించుకోండి. సినిమాను ఒక మాట అనడం సులువే.. కానీ, ఒక సినిమా కోసం ఎంతో మంది కష్టపడుతుంటారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ మారుతికి, నిర్మాత విశ్వప్రసాద్‌కు థ్యాంక్స్. ప్రభాస్ గురించి చెప్పాలంటే.. తనొక సూపర్ స్టార్ అని అనుకోరు, తనని సూపర్ స్టార్‌లా ఇతరులు ట్రీట్ చేయాలని కూడా భావించరు. ఆయనలోని చిన్న పిల్లాడి మనస్తత్వం ఇంకా అలాగే ఉంది. అది నిజంగా చాలా గ్రేట్ విషయం’’ అని అన్నారు.

Also Read- Prithviraj Shetty: యానిమల్, దురంధర్, కెజియఫ్‌లలో హీరోగా నేను చేస్తే బాగుండేది!

36 వేల స్క్వేర్ ఫీట్‌తో

ఇదే కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మా సంస్థ నుంచి ఇప్పటి వరకు కార్తికేయ 2, జాట్, మిరాయ్ వంటి సినిమాలను ఇక్కడ రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో లార్జెస్ట్ మూవీ రాజా సాబ్, బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్‌తో నిర్మించాం. ఆయన బాహుబలికి ముందు ఎలా కనిపించారో ఈ చిత్రంలో అలాగే కనిపిస్తారు. ఫన్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. రాజా సాబ్ కోసం మేము భారీ సెట్స్ నిర్మించాం. హై క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ప్రభాస్, జరీనా మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. అలాగే బొమన్ ఇరానీ కీ రోల్ చేసి మా సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. 36 వేల స్క్వేర్ ఫీట్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చేయని బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. అలాగే లార్జెస్ట్ వీఎఫ్ఎక్స్ కూడా ఈ మూవీలో చూస్తారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్లుగా ఉండాలనే సంజయ్ దత్‌ను తాత పాత్రకు తీసుకున్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!