Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైంది, కానీ ప్రేక్షకుల ఆశలు ఇంకా పూర్తిగా నెరవేరినట్లు లేవు. షో స్టార్ట్ అయి కేవలం రెండు రోజులే అయ్యినా, ఇప్పటికే కొంతమంది వీక్షకులు ‘బోరింగ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. “అసలు మజా లేదు, చూస్తుంటే నిద్ర పట్టేస్తుంది” అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కంటెస్టెంట్లు కూడా అంతా సాధారణంగానే ఉన్నారని, పెద్దగా కామెడీ లేదా డ్రామా లేవని అంటున్నారు ప్రేక్షకులు. కానీ, మొదటి రోజు నుంచే హౌస్‌లో స్పార్క్ మొదలైంది.
ఇమ్మాన్యుయెల్ (జబర్దస్త్ ఫేమ్) హరీష్‌ను ‘గుండు అంకుల్’ అని పిలిచి టీజ్ చేయగా, హరీష్ ఫుల్ ఫైర్ అయ్యి “లిమిట్స్‌లో మాట్లాడు రా!” అని రిప్లై ఇచ్చాడు. రెండో రోజు కూడా అదే టెన్షన్ కొనసాగింది, కానీ ఓవరాల్ షో ఇంకా హీట్ అప్ కావాలని అంతా అనుకుంటున్నారు. ప్రేక్షకులు వీకెండ్‌లో నాగార్జున్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు, కానీ మరింత ఎక్సైట్‌మెంట్‌గా సోమవారం నామినేషన్స్‌కు వెయిట్ చేస్తున్నారు.
“ఎవరు నామినేట్ అవుతారో ముందుగానే తెలుసుకోవాలి” అంటూ ఫ్యాన్స్ ట్వీటర్‌లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వీక్ నామినేషన్స్‌లో సెలబ్రిటీలు పాటు కామనర్స్ కూడా మిక్స్ అయ్యారు. ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే, సంజనా లేదా ఫ్లోరా షైనీ, సుమన్‌లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రెడిక్షన్స్ చెబుతున్నాయి. ఎందుకంటే, రెండు రోజుల్లోనే సుమన్ ప్రోమోల్లో కనిపించకపోవడం, సంజనా-ఫ్లోరా మధ్య టెన్షన్ కనిపించడం వల్ల ఓటింగ్ ట్రెండ్స్ అలా ఉన్నాయి. కంటెస్టెంట్లు అంతా యాక్టివ్‌గా లేరని, ముఖ్యంగా కామెడీ టైప్ కారెక్టర్స్ ఇప్పుడు కనీసం 1% కూడా పెర్ఫార్మ్ చేయడం లేదని ప్రేక్షకులు కూడా మండిపడుతున్నారు.