Jabardasth Show Controversy: జబర్దస్త్ కామెడీ షో గురించి నటుడు, యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. మహిధర్ తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ షో నుండి తాము ఎందుకు నిష్క్రమించారో వివరించారు. తాను షో నుండి వెళ్లిపోయిన తర్వాత ఒకటి లేదా రెండు సార్లు సెట్‌ను సందర్శించినప్పుడు, టీమ్ నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయని చెప్పారు.‘క్యాష్’ వంటి టీవీ షోలు నకిలీ ఆస్తులను ప్రాప్స్‌గా ఉపయోగిస్తాయని, ఇచ్చే బహుమతులు అన్నీ నిజమైనవి కావు లేదా విజేతలకు పూర్తిగా ఇవ్వబడవని మహిధర్ వివరించారు. షో వెనుక జరిగే విషయాలు లేదా కుల రాజకీయాల గురించి మాట్లాడితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, అందుకే తాను అంతర్గత సమస్యల గురించి చర్చించడం మానుకుంటానని చెప్పారు. ఇండస్ట్రీలో రాజకీయాలు కుల భావనలు ఉన్నప్పటికీ, ఎవరినీ ఆరోపించడం లేదా వివాదాలను బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదని మహిధర్ తెలిపారు.
Read also-CP Radhakrishnan: భారత 14వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. తెలుగు అభ్యర్థిపై గెలుపు
ఇంకా జబర్దస్త్‌లో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంటుందని, ఎవారికీ తెలియకుండా అలాంటి వారు వ్యవహరాలు చక్కబెడతారన్నారు. అయితే ఈ విషయం తెలిసినపుడు అప్పటివరకూ తనవారిని తెచ్చుకునే వారు అప్పటినుంచి బహిరంగంగా తన కులానికి సంబంధించిన వారిని తెచ్చుకుంటారని చెప్పుకొచ్చారు. అంతే కాకుంగా ఇదే రాజకీయానికి తాను కూడా బలైపోయానని చెప్పు కొచ్చారు. ఓ సందర్భంలో తాను చివరి సారిగా ఆ షోను చూడటానికి వెళ్లినపుడు అక్కడ కొంత మంది స్నేహితులను కలిసి పార్టీ ఇచ్చానని, అదే సమయంలో ఆ షోకి సంబంధించిన ఓ వ్యక్తి వచ్చి ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్లి పోవాలి అని తెలపగా వెళ్లి పోయానని. కానీ ఎందుకన్నాడో అప్పుడు తెలియలేదని తర్వాత ఎవరో చెప్పారని అదీ ఎందుంకటే జబర్దస్త్ షో గురించి ఓ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం వారికి ఇష్టంలేదని అందుకే అలా అన్నారని తెలపారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్గా మారుతోంది.
Read also-Daksha Movie: మంచు లక్ష్మి ‘దక్ష’ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు.. ఏం యాక్షన్ గురూ..
జబర్దస్త్, ఈటీవీలో 2013 నుండి ప్రసారమవుతున్న ఒక ప్రముఖ తెలుగు కామెడీ షో. తెలుగు ప్రేక్షకులలో గొప్ప ఆదరణ పొందింది. ఈ షోలో వివిధ కామెడీ బృందాలు సామాజిక, సినిమా, రాజకీయ అంశాలపై వ్యంగ్యాత్మక స్కిట్‌లు ప్రదర్శిస్తాయి. జడ్జ్‌లైన నాగబాబు, రోజా సెల్వమణి మార్కులు ఇస్తారు. మౌనిక రెడ్డి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి కమెడియన్లు ఈ షో ద్వారా పేరు సంపాదించి, సినిమాల్లోకి అడుగుపెట్టారు. అయితే, కొందరు మాజీ ఆర్టిస్టులు కుల రాజకీయాలు, అంతర్గత విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. కానీ ఇవి ఎక్కువగా లోయర్ లెవెల్‌లో జరుగుతాయని, ఉన్నత స్థాయికి తెలియవని చెప్పారు. “ఎక్స్‌ట్రా జబర్దస్త్” షో కూడా ఇదే ఫార్మాట్‌లో యువ కళాకారులకు అవకాశాలు కల్పిస్తుంది.